Telugu Global
Cinema & Entertainment

నటుడికి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన సుధీర్ బాబు

“మనం” సినిమాతో రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు నటుడు హర్షవర్ధన్. “అమృతం” సీరియల్ తో ఫేమస్ అయిన హర్షవర్ధన్ ఆ తరువాత నటనపై కంటే కూడా రచన పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఇక “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే సినిమాతో దర్శకుడిగా మారిన హర్షవర్ధన్ ఆ సినిమా ని రిలీజ్ చేయాలి అని చాలా ట్రై చేసాడు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కి నోచుకోలేదు. […]

నటుడికి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన సుధీర్ బాబు
X

“మనం” సినిమాతో రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు నటుడు హర్షవర్ధన్. “అమృతం” సీరియల్ తో ఫేమస్ అయిన హర్షవర్ధన్ ఆ తరువాత నటనపై కంటే కూడా రచన పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఇక “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే సినిమాతో దర్శకుడిగా మారిన హర్షవర్ధన్ ఆ సినిమా ని రిలీజ్ చేయాలి అని చాలా ట్రై చేసాడు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కి నోచుకోలేదు.

అయితే ఇప్పుడు ఈ దర్శకుడు తన రెండో సినిమాకి రెడీ అవుతున్నాడు. తన నెక్స్ట్ మూవీ లో సుధీర్ బాబు ని హీరో గా పెట్టాలని ఫిక్స్ అయ్యాడు హర్షవర్ధన్. ఈ సినిమా ని రూపొందించేందుకు స్క్రిప్ట్ ని సిద్ధం చేసి ఈ స్క్రిప్ట్ ని సుధీర్ కి వినిపించాడు. ఈ స్క్రిప్ట్ ని విన్న సుధీర్ కూడా ఈ సినిమా కి ఓకే చేసాడట. దర్శకుడు ఈ సినిమాని కొత్త కథ తోరూపొందిచబోతున్నాడు అని ఫిలిం నగర్ టాక్. మరి హర్షవర్ధన్ ఈ సినిమాతో అయిన తన దర్శకత్వ ప్రతిభని చూపిస్తాడో లేదో చూడాలి.

First Published:  9 Dec 2018 9:25 PM GMT
Next Story