Telugu Global
NEWS

కంగారూ వేటలో టీమిండియా తొలిదెబ్బ

అడిలైడ్ టెస్ట్ లో విరాట్ సేన 31 పరుగుల విజయం నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియాకు 1-0 ఆధిక్యం చతేశ్వర్ పూజారాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డిసెంబర్ 14 నుంచి పెర్త్ వేదికగా రెండో టెస్ట్ ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను…టాప్ ర్యాంకర్ టీమిండియా…విజయంతో ప్రారంభించింది. అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన తొలిటెస్ట్ ఆఖరి రోజు ఆటలో టీమిండియా 31 పరుగులతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. 323 పరుగుల […]

కంగారూ వేటలో టీమిండియా తొలిదెబ్బ
X
  • అడిలైడ్ టెస్ట్ లో విరాట్ సేన 31 పరుగుల విజయం
  • నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియాకు 1-0 ఆధిక్యం
  • చతేశ్వర్ పూజారాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
  • డిసెంబర్ 14 నుంచి పెర్త్ వేదికగా రెండో టెస్ట్

ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను…టాప్ ర్యాంకర్ టీమిండియా…విజయంతో ప్రారంభించింది.

అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన తొలిటెస్ట్ ఆఖరి రోజు ఆటలో టీమిండియా 31 పరుగులతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

323 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 291 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ రెండో డౌన్ ఆటగాడు షాన్ మార్ష్ 60 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్, షమీ తలో మూడు వికెట్లు పడగొట్టారు. భారత సెంచరీ హీరో చతేశ్వర్ పూజారాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సిరీస్ లోని రెండోటెస్ట్…. పెర్త్ వాకా స్టేడియం వేదికగా ఈనెల 14న ప్రారంభమవుతుంది.

టీమిండియా నయావాల్ చతేశ్వర్ పూజారా తొలిఇన్నింగ్స్ లో 123, రెండో ఇన్నింగ్స్ లో 71 పరుగులు సాధించడం విశేషం. పూజారా టెస్ట్ కెరియర్ ఓ మ్యాచ్ లో సెంచరీ, హాఫ్ సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి.

First Published:  10 Dec 2018 3:55 AM GMT
Next Story