Telugu Global
NEWS

బాలకృష్ణా?!... ఛ... నేను ఆ పేరు కూడా వినలేదు " నాగబాబు

నందమూరి బాలకృష్ణపై మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్రపరిశ్రమలో హాట్‌హాట్‌గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు… బాలయ్య గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా… బాలయ్య గొప్ప నటుడు… అప్పట్లో కృష్ణ, బాలయ్య కలిసి ”నేరం-శిక్ష” లాంటి మంచి సినిమాల్లో నటించారు. బాలయ్య గొప్ప నటుడు అని వ్యాఖ్యానించారు. ఇంతలో యాంకర్ తాము అడుగుతున్నది అలనాటి బాలయ్య గురించి కాదు…. నందమూరి బాలకృష్ణ గురించి అని వివరించారు. నందమూరి బాలకృష్ణ గురించి […]

బాలకృష్ణా?!... ఛ... నేను ఆ పేరు కూడా వినలేదు  నాగబాబు
X

నందమూరి బాలకృష్ణపై మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్రపరిశ్రమలో హాట్‌హాట్‌గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగబాబు… బాలయ్య గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా… బాలయ్య గొప్ప నటుడు… అప్పట్లో కృష్ణ, బాలయ్య కలిసి ”నేరం-శిక్ష” లాంటి మంచి సినిమాల్లో నటించారు. బాలయ్య గొప్ప నటుడు అని వ్యాఖ్యానించారు.

ఇంతలో యాంకర్ తాము అడుగుతున్నది అలనాటి బాలయ్య గురించి కాదు…. నందమూరి బాలకృష్ణ గురించి అని వివరించారు. నందమూరి బాలకృష్ణ గురించి అనగానే నాగబాబు ఆదోలా ఫేస్‌ పెట్టి.. నందమూరి బాలకృష్ణా?… ఛ ఆ పేరు కూడా వినలేదు…. అంటూ వ్యాఖ్యానించారు.

నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని నాగబాబు చెప్పడంతో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నాగబాబుకు ఎంత అహంకారం అని మండిపడుతున్నారు.

అయితే గతంలో బాలకృష్ణ కూడా ఒక సందర్బంలో మెగా బ్రదర్స్‌ను చులకన చేస్తూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ గురించి ప్రస్తావన వస్తే…. ఆయన ఎవరో తెలియదన్నట్లు బాలకృష్ణ మాట్లాడాడు. గతంలో లేపాక్షి ఉత్సావాల సందర్భంగా అందరు నటులను ఆహ్వానించిన బాలకృష్ణ … మెగా బ్రదర్స్ కు మాత్రం ఆహ్వానం పంపలేదు. దానిపై అప్పట్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… తన పక్కన గ్లామర్ ఉన్నవారే ఉన్నారు…. వారితోనే కలిసి ప్రయాణిస్తా అని వ్యాఖ్యానించారు.

తాను ఎవరినీ నెత్తిన ఎక్కించుకోనని , అందుకే అలాంటి వాళ్లను పిలవలేదని చిరంజీవిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను డిక్టేటర్ పద్దతిలోనే వెళ్తానని బాలయ్య వ్యాఖ్యానించారు. ఆ విషయాలను మనసులో పెట్టుకునే నాగబాబు ఈ తరహాలోనే బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పి ఉంటారని భావిస్తున్నారు.

ఇటీవల కేఏ పాల్ కూడా… బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పారు.

First Published:  10 Dec 2018 1:20 AM GMT
Next Story