Telugu Global
Cinema & Entertainment

బాలకృష్ణ మంచి కమెడియన్

నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదంటూ ఇప్పటికే దుమారం రేపిన నాగబాబు, ఇప్పుడు మరోసారి బాలయ్యపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాలయ్య ఎవరని అడిగితే తనకు తెలియదని, కేవలం ఒకప్పటి పాత నటుడు బాలయ్య మాత్రమే తెలుసని తెలిపిన నాగబాబు, ఇప్పుడు బాలకృష్ణ పేరుతో మరో కామెడీకి తెరలేపారు. బాలకృష్ణ తనకు తెలుసంటూ మరో వీడియో పోస్ట్ చేశారు నాగబాబు. ఆ వీడియోలో బాలకృష్ణను పెద్ద నటుడిగా, అతిపెద్ద కమెడియన్ గా చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి పెద్దపెద్ద నటులతో […]

బాలకృష్ణ మంచి కమెడియన్
X

నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదంటూ ఇప్పటికే దుమారం రేపిన నాగబాబు, ఇప్పుడు మరోసారి బాలయ్యపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాలయ్య ఎవరని అడిగితే తనకు తెలియదని, కేవలం ఒకప్పటి పాత నటుడు బాలయ్య మాత్రమే తెలుసని తెలిపిన నాగబాబు, ఇప్పుడు బాలకృష్ణ పేరుతో మరో కామెడీకి తెరలేపారు.

బాలకృష్ణ తనకు తెలుసంటూ మరో వీడియో పోస్ట్ చేశారు నాగబాబు. ఆ వీడియోలో బాలకృష్ణను పెద్ద నటుడిగా, అతిపెద్ద కమెడియన్ గా చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ లాంటి పెద్దపెద్ద నటులతో కూడా నటించారని, ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం అని అన్నారు. ఈ బాలకృష్ణను ఆరోజుల్లో ప్రేక్షకులు అంజిగాడు అని నిక్ నేమ్ తో పిలిచే వాళ్ళు.

మొన్న జరిగిన facebook లైవ్ లో బాలకృష్ణ గారు ఎవరో తెలీదు అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను.

Publiée par Naga Babu sur Dimanche 9 décembre 2018

నాగబాబు ఇలా బాలకృష్ణ గురించి చెబుతుంటే అంతా ఆశ్చర్యపోయారు. ఇక వీడియోకు ముగింపునిస్తూ చివర్లో వల్లూరి బాలకృష్ణ ఫొటోను చూపించి వ్యంగ్యంగా స్పందించారు నాగబాబు. వల్లూరి బాలకృష్ణను తనకు గుర్తుచేసిన కొంతమంది నెటిజన్లకు థ్యాంక్స్ కూడా చెప్పారు.

నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ ఇలా పరోక్షంగా స్పందించారు నాగబాబు. దీంతో నందమూరి అభిమానులంతా భగ్గుమంటున్నారు. సోషల్ మీడియాలో నాగబాబుకు వ్యతిరేకంగా వరుసపెట్టి పోస్టులు పెడుతున్నారు.

First Published:  10 Dec 2018 7:08 AM GMT
Next Story