Telugu Global
Cinema & Entertainment

బయోపిక్ నుంచి మరో పాట

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఇప్పటికే ఓ పాట రిలీజైంది. అర్థం చేసుకోవడానికి, హమ్ చేసుకోవడానికి చాలా కష్టమైన పాట అది. క్లిష్టమైన పదాలతో కంపోజ్ అయిన ఆ సాంగ్ వినడానికి మాత్రం బాగుంది. విడుదలైన వెంటనే ఓ 5 గంటల పాటు ట్రెండింగ్ కూడా నడిచింది. ఇప్పుడు రెండో పాటకు రెడీ అవుతోంది యూనిట్. ఈసారి రాజర్షి అనే సాహిత్యంతో సాగే పాటను విడుదల చేయబోతున్నారు. రాజ‌ర్షిని డిసెంబ‌ర్ 12న ఉద‌యం 10.31 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. […]

బయోపిక్ నుంచి మరో పాట
X

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఇప్పటికే ఓ పాట రిలీజైంది. అర్థం చేసుకోవడానికి, హమ్ చేసుకోవడానికి చాలా కష్టమైన పాట అది. క్లిష్టమైన పదాలతో కంపోజ్ అయిన ఆ సాంగ్ వినడానికి మాత్రం బాగుంది. విడుదలైన వెంటనే ఓ 5 గంటల పాటు ట్రెండింగ్ కూడా నడిచింది. ఇప్పుడు రెండో పాటకు రెడీ అవుతోంది యూనిట్.

ఈసారి రాజర్షి అనే సాహిత్యంతో సాగే పాటను విడుదల చేయబోతున్నారు. రాజ‌ర్షిని డిసెంబ‌ర్ 12న ఉద‌యం 10.31 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మిగిలిన పాట‌ల్ని కూడా డిసెంబ‌ర్ లోనే విడుద‌ల చేస్తారు. 14వ తేదీన తిరుపతిలో ఆడియో ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు.

రానా, ర‌కుల్, విద్యాబాల‌న్, క‌ళ్యాణ్ రామ్, సుమంత్, నిత్యామీన‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ కనిపించనున్నాడు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ సినిమాను స్వయంగా బాలయ్య నిర్మిస్తున్నారు. వారాహి చ‌ల‌న‌చిత్రం.. విబ్రి మీడియా పతాకంపై సాయి కొర్ర‌పాటి, విష్ణు ఇందూరి ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో తొలి భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయబోతున్నారు. మలి భాగాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. తొలి భాగానికి కథానాయకుడు, రెండో భాగానికి మహానాయకుడు అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు.

First Published:  10 Dec 2018 7:45 AM GMT
Next Story