Telugu Global
Cinema & Entertainment

2.0 మూవీ 10 రోజుల వసూళ్లు

శంకర్, రజనీకాంత్ కాంబోలో వచ్చిన 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు వసూళ్లు స్టడీగా ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు అటు ఉత్తరాదిన కూడా బడా సినిమాలేవీ లేకపోవడం 2.0కు బాగా కలిసొచ్చింది. తాజాగా ఈ సినిమా 600 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 623 కోట్ల రూపాయలు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 2.0 […]

2.0 మూవీ 10 రోజుల వసూళ్లు
X
శంకర్, రజనీకాంత్ కాంబోలో వచ్చిన 2.0 సినిమా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు వసూళ్లు స్టడీగా ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు అటు ఉత్తరాదిన కూడా బడా సినిమాలేవీ లేకపోవడం 2.0కు బాగా కలిసొచ్చింది. తాజాగా ఈ సినిమా 600 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 623 కోట్ల రూపాయలు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 2.0 పరిస్థితి చెప్పుకునేంత ఆశాజనకంగా లేదు. వసూళ్లు అయితే బాగానే వస్తున్నాయి కానీ, బ్రేక్-ఈవెన్ అవ్వడం మాత్రం కష్టమంటోంది ట్రేడ్. నిన్నటితో 11 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ఏపీ, నైజాంలో 45 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ సినిమా హక్కులు మాత్రం 74 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. వసూళ్లు క్రమంగా తగ్గడంతో బ్రేక్ ఈవెన్ కష్టమని తెలుస్తోంది. ఏపీ, నైజాంలో 2.0 సినిమాకు ఈ 10 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 20.52 కోట్లు
సీడెడ్ – రూ. 6.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.24 కోట్లు
ఈస్ట్ – రూ. 3.26 కోట్లు
వెస్ట్ – రూ. 2.24 కోట్లు
గుంటూరు – రూ. 3.10 కోట్లు
కృష్ణా – రూ. 2.57 కోట్లు
నెల్లూరు – రూ. 1.67 కోట్లు
First Published:  10 Dec 2018 10:51 AM GMT
Next Story