మైసూరు కి వెళ్తున్న “సై రా” టీం

మెగా స్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న “సై రా” సినిమా యొక్క షూటింగ్ మొన్నటి వరకు హైదరాబాద్ లో జరిగింది. అయితే ఇటివలే ఆ షెడ్యూల్ పూర్తవ్వడంతో ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నారు మూవీ యూనిట్. ఈ తదుపరి షెడ్యూల్ ని మైసూరు లో జరపాలి అని మూవీ యూనిట్ ప్లాన్ వేసారు అంట, ఎందుకంటే సినిమా మొత్తం ప్రీ ఇండిపెండెన్స్ నేపధ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి అక్కడ ఉన్న కొన్ని లొకేషన్స్ లో కొన్ని ముఖ్య సన్నివేశాలు షూట్ చేద్దాం అని మూవీ యూనిట్ భావిస్తున్నారు.

ఇక ఈ షెడ్యూల్ కోసం ఇప్పటికే మూవీ యూనిట్ హైదరబాద్ నుంచి మైసూరు బయిల్దేరివెళ్లారు అని టాక్. కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, చిరంజీవి మధ్య సీన్స్ బాగుంటాయి అని ఫిలిం నగర్ టాక్. అలాగే ఈ సినిమాలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి తో పాటు కన్నడ హీరో సుదీప్ కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు