Telugu Global
NEWS

గెలిచిన అభ్యర్థులకు భద్రత కల్పించాలి " ఉత్తమ్‌

హంగ్‌ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా మహాకూటమినే ఆహ్వానించాలని గవర్నర్‌ను మహాకూటమి నేతలు కోరారు. కూటమి ఎన్నికల కంటే ముందే ఏర్పడింది కాబట్టి సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం… మహాకూటమిని సింగిల్‌ పార్టీగా గుర్తించాల్సి ఉంటుందన్నారు. మహాకూటమి ఎన్నికలకు ముందే ఏర్పడిందన్న దానికి సంబంధించిన ఆధారాలను కూడా గవర్నర్‌కు అందజేశామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు. ఫలితాల ప్రకటన తర్వాత ఎన్నికైన ఎమ్మెల్యేలకు సరైన భద్రత కల్పించాలని తాము గవర్నర్‌ను కోరామన్నారు. కేవలం ముందు జాగ్రత్తగానే…. హంగ్‌ […]

గెలిచిన అభ్యర్థులకు భద్రత కల్పించాలి  ఉత్తమ్‌
X

హంగ్‌ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుగా మహాకూటమినే ఆహ్వానించాలని గవర్నర్‌ను మహాకూటమి నేతలు కోరారు. కూటమి ఎన్నికల కంటే ముందే ఏర్పడింది కాబట్టి సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం… మహాకూటమిని సింగిల్‌ పార్టీగా గుర్తించాల్సి ఉంటుందన్నారు.

మహాకూటమి ఎన్నికలకు ముందే ఏర్పడిందన్న దానికి సంబంధించిన ఆధారాలను కూడా గవర్నర్‌కు అందజేశామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు. ఫలితాల ప్రకటన తర్వాత ఎన్నికైన ఎమ్మెల్యేలకు సరైన భద్రత కల్పించాలని తాము గవర్నర్‌ను కోరామన్నారు. కేవలం ముందు జాగ్రత్తగానే…. హంగ్‌ వస్తే ఇబ్బందులు ఉండకూడదనే తాము గవర్నర్‌ను కలిశామన్నారు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి.

గవర్నర్‌ను ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఎల్‌ రమణ, కోదండరాం, ఆజాద్‌ తదితరులు కలిశారు.

First Published:  10 Dec 2018 5:25 AM GMT
Next Story