Telugu Global
NEWS

చంద్రబాబూ.... ఇక నీ పతనం మొదలైంది.... లగడపాటి పై దర్యాప్తు చేయాలి....

తెలంగాణలో మహాకూటమి ఒక మహా ఓటమిని మూటకట్టుకుందని వ్యాఖ్యానించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. చంద్రబాబు పతనానికి తెలంగాణ ఎన్నికలతో నాంది పడిందని భావిస్తున్నామన్నారు. ఈ ఓటమి చంద్రబాబుకు అతి పెద్ద ఓటమి అన్నారు. ఒక అసహ్యమైన కలయికగా టీడీపీ, కాంగ్రెస్‌ కూటమిని ప్రజలు గుర్తించారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పైనా అంతో ఇంతో ప్రజా వ్యతిరేకత ఉండడం సహజమని… కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్ గతంలో కంటే ఎక్కువగా సీట్లను సొంతం చేసుకోవడం బట్టి చూస్తుంటే… చంద్రబాబుపై […]

చంద్రబాబూ.... ఇక నీ పతనం మొదలైంది.... లగడపాటి పై దర్యాప్తు చేయాలి....
X

తెలంగాణలో మహాకూటమి ఒక మహా ఓటమిని మూటకట్టుకుందని వ్యాఖ్యానించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. చంద్రబాబు పతనానికి తెలంగాణ ఎన్నికలతో నాంది పడిందని భావిస్తున్నామన్నారు. ఈ ఓటమి చంద్రబాబుకు అతి పెద్ద ఓటమి అన్నారు.

ఒక అసహ్యమైన కలయికగా టీడీపీ, కాంగ్రెస్‌ కూటమిని ప్రజలు గుర్తించారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పైనా అంతో ఇంతో ప్రజా వ్యతిరేకత ఉండడం సహజమని… కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్ గతంలో కంటే ఎక్కువగా సీట్లను సొంతం చేసుకోవడం బట్టి చూస్తుంటే… చంద్రబాబుపై ప్రజావ్యతిరేకత ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

చంద్రబాబు ప్రజా వ్యతిరేకత ముందు కేసీఆర్‌పై వ్యతిరేకతను తెలంగాణ ప్రజలు చాలా చిన్నదిగా భావించారన్నారు. మహాకూటమి ఓటమిని ఒక మంచి పరిణామన్నారు. ఇలాంటి అనైతిక పొత్తులు, అనైతిక రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు అని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబులాంటి దుర్మార్గుడు వచ్చి తమకు నీతులు చెప్పడం ఏమిటని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ధనబలం కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. ఏపీలో అవినీతి చేసి సంపాదించిన సొమ్మును తెలంగాణలో కుమ్మరించి మహాకూటమిని గెలిపించేందుకు ప్రయత్నించారన్నారు.

చంద్రబాబు కూటమిలో లేకుంటే కాంగ్రెస్‌కు ఇంతకంటే కొంచెం మెరుగ్గానే ఫలితాలు వచ్చి ఉండేవన్నారు. చంద్రబాబు డబ్బాలు కొట్టి నమ్మించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. సర్వే రూపంలో లగడపాటి ఒక పెద్ద కుట్ర చేశారన్నారు.

లగడపాటి దివాలా తీసిన కంపెనీ యజమాని అని…. బ్యాంకులకు అప్పులు ఎగొట్టి బజారులో తిరుగుతున్న వ్యక్తి అని అన్నారు. అలాంటి లగడపాటిని తీసుకొచ్చి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తే లగడపాటిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఒప్పందం చేసుకుని…. అతడి చేత తప్పుడు సర్వేలు ప్రచారం చేయించారన్నారు.

గతంలో ఎన్నికల తర్వాత మాత్రమే లగడపాటి సర్వే వివరాలు చెప్పేవారని… కానీ ఈసారి మాత్రం ఎన్నికలకు ముందే మూడుసార్లు బయటకు వచ్చి తప్పుడు సర్వేను వెల్లడించడం ద్వారా తెలంగాణ ప్రజలను మహాకూటమి వైపు మళ్లించే ప్రయత్నం చేశారన్నారు. వెయ్యి హత్యల కంటే ఘోరమైన నేరాన్ని లగడపాటి చేశారన్నారు అంబటిరాంబాబు.

లగడపాటి సర్వేల వల్ల వేల కోట్లు నష్టం వాటిల్లిందని…. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయించాలన్నారు. లగడపాటి శకుని పాత్ర పోషించారన్నారు. మహాకూటమి నేతలు గవర్నర్‌ వద్దకు వెళ్లి తామందరినీ ఒకటేలా చూడాలని కోరారని… ప్రజలు నిజంగానే కూటమిలోని అన్ని పార్టీలను ఒకేలా చూసి కలిపి హుస్సేన్‌సాగర్‌లో ముంచేశారన్నారు.

First Published:  11 Dec 2018 2:30 AM GMT
Next Story