Telugu Global
NEWS

ముఖం చాటేసిన బాబు.... ప్రెస్‌నోట్‌తో స‌రి!

ఏమాత్రం అవ‌కాశం దొరికినామీడియా స‌మావేశం పెట్టి క‌నీసం రెండు గంట‌ల పాటు ప్ర‌సంగిస్తూ, చెప్పిందే చెబుతూ ఉండే ఎ.పి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత ముఖం చాటేశారు. అనుకోని రీతిలో చావుదెబ్బ త‌గ‌ల‌డంతో ముఖం చూపించ‌లేక ఇంట్లో ఉండి కూడా మీడియాకు దూరంగా ఉన్నారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతోన్న ప్ర‌తిక్ష‌ణం ఆయ‌న‌లో బీపీ పెరిగింది. ఏమి చేయాలో పాలుపోని స్థితి. ఫ‌లితాలు పూర్తిగా వెలువ‌డిన త‌ర్వాత జ‌రిగిన వైఫ‌ల్యాన్ని అంగీక‌రించ‌కుండా, దేశంలో […]

ముఖం చాటేసిన బాబు.... ప్రెస్‌నోట్‌తో స‌రి!
X

ఏమాత్రం అవ‌కాశం దొరికినామీడియా స‌మావేశం పెట్టి క‌నీసం రెండు గంట‌ల పాటు ప్ర‌సంగిస్తూ, చెప్పిందే చెబుతూ ఉండే ఎ.పి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత ముఖం చాటేశారు. అనుకోని రీతిలో చావుదెబ్బ త‌గ‌ల‌డంతో ముఖం చూపించ‌లేక ఇంట్లో ఉండి కూడా మీడియాకు దూరంగా ఉన్నారు.

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతోన్న ప్ర‌తిక్ష‌ణం ఆయ‌న‌లో బీపీ పెరిగింది. ఏమి చేయాలో పాలుపోని స్థితి. ఫ‌లితాలు పూర్తిగా వెలువ‌డిన త‌ర్వాత జ‌రిగిన వైఫ‌ల్యాన్ని అంగీక‌రించ‌కుండా, దేశంలో ఐదు రాష్ర్టాల్లోని ఫ‌లితాల‌పై ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. మూడుచోట్ల కాంగ్రెస్ గెలిచింది, కార‌ణం బిజెపి నియంతృత్వం వల్ల‌నే అని వ్యాఖ్యానించారు.

తెలంగాణాలో టి.ఆర్‌.ఎస్‌. గెల‌చినందుకు అభినంద‌న‌లు అనికూడా ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో ఆఖ‌రున పేర్కొన్నారు. దీన్నిబ‌ట్టి చూస్తే తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను క‌నీసం చంద్ర‌బాబు అంచ‌నా వేయ‌లేక‌పోయారు.

హైద‌రాబాద్ త‌న‌కు మాన‌స‌ పుత్రిక అని, తానే నిర్మాణం చేశాన‌ని, ఇక్క‌డి ప్ర‌తి అంశం త‌న‌కు తెలుసున‌ని ఎన్నిక‌ల స‌మావేశాల్లో పేర్కొన్న చంద్ర‌బాబు అక్క‌డి ప్ర‌జ‌ల నాడిని ఎందుకు అంచ‌నా వేయ‌లేక‌ పోయారో అర్థం కావ‌డం లేదు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత మీడియాకోసం ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌విడుద‌ల చేశారు.

సారాంశం ఇలా ఉంది….

దేశ‌వ్యాప్తంగా బిజెపి బ‌ల‌హీన‌ప‌డింది. గ‌త ఐదేళ్ల‌లో జ‌రిగిన అనేక ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వ్వ‌డ‌మే కాకుండా ఇపుడు తాజాగా జ‌రిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా బిజెపి పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డింది. బిజెపి పాల‌న ప‌ట్ల దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోని ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు.

గ‌త ఐదేళ్ల‌లో బిజ‌పి చేసిందేమీ లేద‌నేది అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు గుర్తించారు. ప్ర‌త్యామ్నాయం వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నారు. బిజెపి కి వ్య‌తిరేకంగా మేము చేస్తున్న‌పోరాటానికి ప్ర‌జ‌లు అండ‌గా ఉన్నారు.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బిజెపికి బ‌ల‌మైన ప్ర‌త్యామ్నాయం ఏర్పాటుకు ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల ఫ‌లితాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. తెలంగాణలో ప్రజాతీర్పు ను తెలుగుదేశం పార్టీ గౌర‌విస్తుంది. ముఖ్య‌మంత్రి కెసిఆర్ కు అభినంద‌న‌లు. ఐదు రాష్ర్టాల‌లో గెలుపొందిన శాస‌న‌స‌భ్యులు అంద‌రికీ అభినంద‌న‌లు…. అని చంద్ర‌బాబు ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ ముగించారు.

First Published:  11 Dec 2018 8:32 AM GMT
Next Story