Telugu Global
Cinema & Entertainment

టీజర్ రెడీ.... కెవ్వు కామెడీ

రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు విడుదలకాబోతోంది ఎఫ్-2 సినిమా టీజర్. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను లాక్ చేశారు. ఆ టీజర్ టాక్ ఇప్పుడు బయటకు వచ్చింది. టైటిల్ లో చెప్పినట్టే ఎఫ్-2 సినిమా టీజర్ హిలేరియస్ గా ఉందట. వెంకటేష్ కామిక్ ఎక్స్ ప్రెషన్స్, వరుణ్ తేజ్ కామెడీ డైలాగులతో టీజర్ నిండిపోయిందట. పూర్తిగా ఈ ఇద్దరిపైనే దృష్టిపెట్టి టీజర్ ను కట్ చేశారట. అదే సమయంలో […]

టీజర్ రెడీ.... కెవ్వు కామెడీ
X

రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు విడుదలకాబోతోంది ఎఫ్-2 సినిమా టీజర్. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను లాక్ చేశారు. ఆ టీజర్ టాక్ ఇప్పుడు బయటకు వచ్చింది. టైటిల్ లో చెప్పినట్టే ఎఫ్-2 సినిమా టీజర్ హిలేరియస్ గా ఉందట. వెంకటేష్ కామిక్ ఎక్స్ ప్రెషన్స్, వరుణ్ తేజ్ కామెడీ డైలాగులతో టీజర్ నిండిపోయిందట.

పూర్తిగా ఈ ఇద్దరిపైనే దృష్టిపెట్టి టీజర్ ను కట్ చేశారట. అదే సమయంలో సినిమా స్టోరీని కాస్త రివీల్ చేసేలా టీజర్ ఉందట. అనీల్ రావిపూడి సినిమాల్లో కామెడీ బాగుంటుంది. ఇతడి సినిమాల్లో కామెడీ ట్రాక్ బాగుంటుందనే టాక్ మొదటి సినిమా పటాస్ నుంచి ఉంది. రీసెంట్ గా వచ్చిన రాజా ది గ్రేట్ లో కూడా కామెడీ భలేగా ఉంటుంది. అదే కోవలో ఎఫ్-2 సినిమా కూడా హిలేరియస్ గా ఉంటుందని చెబుతున్న యూనిట్, దానికి బలం చేకూర్చడానికి టీజర్ ను ఫన్నీ ఎలిమెంట్స్ తో నింపేశారు.

తమన్న, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

First Published:  11 Dec 2018 6:25 AM GMT
Next Story