Telugu Global
Cinema & Entertainment

రూమర్స్ పై స్పందించిన మాస్ మహారాజ్

మాస్ మహారాజ్ రవితేజ గత కొంత కాలంగా ఫ్లాప్స్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇటివలే శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన “అమర్ అక్బర్ అంటోనీ” సినిమా కూడా రవితేజ కి భారీ ఫ్లాప్ కి మూట గట్టింది. అయితే ఇలాంటి టైం లో రవితేజ వి.ఐ ఆనంద్ తో కలిసి ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు అని ఆ దర్శకుడే అధికారికంగా ప్రకటించాడు. కానీ గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయింది అసలు […]

రూమర్స్ పై స్పందించిన మాస్ మహారాజ్
X

మాస్ మహారాజ్ రవితేజ గత కొంత కాలంగా ఫ్లాప్స్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇటివలే శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన “అమర్ అక్బర్ అంటోనీ” సినిమా కూడా రవితేజ కి భారీ ఫ్లాప్ కి మూట గట్టింది. అయితే ఇలాంటి టైం లో రవితేజ వి.ఐ ఆనంద్ తో కలిసి ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు అని ఆ దర్శకుడే అధికారికంగా ప్రకటించాడు. కానీ గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయింది అసలు రవితేజ వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చెయ్యట్లేదు అని రూమర్ ఫిలిం నగర్ లో హలచల్ చేస్తుంది.

అయితే ఇప్పుడు ఈ విషయం పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి సినిమా ఆగిపోలేదు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది అని ప్రకటించాడు. వి.ఐ ఆనంద్ ఈ సినిమా కథ కథనాలు బాగా రావాలి అని కృషి చేస్తున్నాడు అని, అందుకే ఈ సినిమా లేట్ అవుతుంది అని ఆయన అన్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పై రూపొందుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్, నాబా నటేష్, ప్రియాంక జవల్కర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  10 Dec 2018 10:50 PM GMT
Next Story