Telugu Global
NEWS

కుక్కల్లా మొరిగితే ఈసారి మాత్రం ట్రీట్‌మెంట్‌ తప్పని సరిగా ఉంటుంది

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకే క్లారిటీ లేదని ఇక తానేం చేయాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. హోదా వల్ల ఏం వస్తుందని ఇదే చంద్రబాబు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సంజీవినా? అని చంద్రబాబే ప్రశ్నించారన్నారు. రేపు లేదా ఎల్లుండి సీఎంగా ప్రమాణస్వీకారం ఉండవచ్చన్నారు. తనతో పాటు మరొకరు మాత్రమే ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. ఐదు రోజుల తర్వాత కేబినెట్‌ విస్తరణ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగాల విషయంలో […]

కుక్కల్లా మొరిగితే ఈసారి మాత్రం ట్రీట్‌మెంట్‌ తప్పని సరిగా ఉంటుంది
X

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకే క్లారిటీ లేదని ఇక తానేం చేయాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. హోదా వల్ల ఏం వస్తుందని ఇదే చంద్రబాబు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సంజీవినా? అని చంద్రబాబే ప్రశ్నించారన్నారు. రేపు లేదా ఎల్లుండి సీఎంగా ప్రమాణస్వీకారం ఉండవచ్చన్నారు. తనతో పాటు మరొకరు మాత్రమే ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. ఐదు రోజుల తర్వాత కేబినెట్‌ విస్తరణ ఉంటుందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగాల విషయంలో కొన్నిపార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మూడు లక్షల మంది ఉంటే… ప్రైవేట్‌ సంస్థల్లో 30 లక్షల మంది పనిచేస్తున్నారన్నారు.

వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల లెక్కలు తీస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారి సంఖ్య ఒక శాతం కంటే తక్కువగానే ఉందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తామన్నారు. రాబోయే వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

తాను పెట్టే కొత్త జాతీయ పార్టీకి ఇంకా పేరు పెట్టలేదన్నారు. కొత్త పార్టీ పెట్టి రైతు బంధు పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా రైతు బంధుకు మూడున్నర లక్షల కోట్లు అవుతుందన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ భృతి అమలు చేస్తామని… దాదాపు 10 లక్షల మందికి భృతి అందే అవకాశం ఉందన్నారు.

టీం లీడర్‌గా తాను కఠినంగానే ఉంటానని చెప్పారు. అది అప్రజాస్వామికంగా కొందరికి అనిపించినా తనకేం ఇబ్బంది లేదన్నారు. కెప్టెన్‌ టీంను ఎలా నడిపించాలో అలాగే నడిపిస్తారన్నారు. కెప్టెన్ కఠినంగా లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడితే వ్యవస్థ దెబ్బతిని పోతుందన్నారు. కేసీఆర్‌ కఠినంగా లేకపోతే పావలాకు అమ్మేస్తారన్నారు.

తొలిసారి అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టేందుకు ఇతర విషయాలు పట్టించుకోకుండా పనిచేశామన్నారు. ఈసారి మాత్రం ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కుక్కలు మొరిగినట్టు మొరిగితే ట్రీట్‌మెంట్‌ తప్పనిసరిగా ఉంటుందన్నారు. దొంగల భరతం తప్పకుండా పడతామన్నారు. ఈ టర్మ్‌లో వదిలే ప్రసక్తే లేదన్నారు. ఏప్రిల్ నాటికి మిషన్ భగీరథ పూర్తి చేస్తామన్నారు.

First Published:  12 Dec 2018 6:35 AM GMT
Next Story