Telugu Global
International

ఫేస్‌బుక్‌కు బానిస అయ్యారా? అయితే మీకో గుడ్ న్యూస్!

సోషల్ మీడియాకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ బానిసలవుతున్నారు. పొద్దున లేచింది మొదలు… రాత్రి నిద్రపోయేంత వరకు సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. వాట్సప్, ట్విటర్, ఫేస్‌బుక్‌ లాంటి ఫ్లాట్ ఫాంల మీద రోజంతా గంటలు తరబడి గడిపేస్తున్నారు. వీటినుంచి బయటపడాలని భావిస్తున్నవారు ఉన్నారు. అలాంటివారికోసమే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. అదే యువర్ టైం అనే ఫీచర్. ఈ ఫీచర్ తో రోజుకు ఎంత సమయం ఫేస్‌బుక్‌కు […]

ఫేస్‌బుక్‌కు బానిస అయ్యారా? అయితే మీకో గుడ్ న్యూస్!
X

సోషల్ మీడియాకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ బానిసలవుతున్నారు. పొద్దున లేచింది మొదలు… రాత్రి నిద్రపోయేంత వరకు సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. వాట్సప్, ట్విటర్, ఫేస్‌బుక్‌ లాంటి ఫ్లాట్ ఫాంల మీద రోజంతా గంటలు తరబడి గడిపేస్తున్నారు. వీటినుంచి బయటపడాలని భావిస్తున్నవారు ఉన్నారు.

అలాంటివారికోసమే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. అదే యువర్ టైం అనే ఫీచర్. ఈ ఫీచర్ తో రోజుకు ఎంత సమయం ఫేస్‌బుక్‌కు కేటాయిస్తున్నారో తెలుసుకోవచ్చు.

ఈ ఫీచర్ ను యూజర్లు ఫేస్‌బుక్‌ యాప్ లోకి వెళ్లి మోర్ ట్యాబ్ లో ఉండే సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ విభాగం నుంచి పొందవచ్చు. అక్కడే యువర్ టైం ఆన్ ఫేస్‌బుక్‌ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకుంటే పైన చెప్పిన విధంగా ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో కొద్ది సమయం మాత్రమే గడపాలని కోరుకునే వారు ఈ ఫీచర్ సహాయంతో ఫేస్‌బుక్ యాప్‌లో రిమైండర్ సెట్ చేసుకోవచ్చు.

దీంతో నిర్దేశిత సమయం ఫేస్‌బుక్‌లో గడపగానే యూజర్‌కు వెంటనే అలర్ట్ వస్తుంది. దాంతో ఫేస్‌బుక్‌ను వాడడం ఆపేయవచ్చు. అయితే ఇది ఎంతవరకు ఉపయోగకరం అనే వాదన కూడా తెరపైకి వస్తోంది. చిన్న నోటిఫికేషన్‌ వస్తే అది తెరిస్తే ఆ సమయాన్ని కూడా ఫేస్‌బుక్‌ గణిస్తుందనీ, ఈ క్రమంలో క్వాలిటీగా గడిపిన సమయాన్ని ఎలా గణిస్తారని టెక్‌ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

First Published:  11 Dec 2018 9:00 PM GMT
Next Story