హాకీ ప్రపంచకప్ లో క్వార్టర్ ఫైనల్స్ లైనప్ రెడీ

  • క్వార్టర్స్ లో ఒకే ఒక్క ఆసియాజట్టు భారత్
  • క్వార్టర్ ఫైనల్లో ఐదు యూరోపియన్ జట్లు
  • క్వార్టర్ ఫైనల్లో భారత్ కు హాలెండ్ గండం

భారత్ వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచకప్ హాకీలో క్వార్టర్ ఫైనల్స్ లైనప్ ఖరారయ్యింది.16 జట్ల గ్రూప్ లీగ్ దశ నుంచి…ఆతిథ్య భారత్, ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా, అర్జెంటీనా, హాలెండ్, జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, బెల్జియం జట్లు నాకౌట్ రౌండ్ లో అడుగుపెట్టాయి. గురువారం జరిగే ఆఖరి క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ హాలెండ్ తో భారత్ ఢీ కొంటుంది.

యూరోప్ జట్ల ఆధిపత్యం…

భారత్ వేదికగా జరుగుతున్న 2018 ప్రపంచకప్ హాకీ టోర్నీలో … తొలిదశ గ్రూప్ లీగ్ కు తెరపడింది. వివిధ ఖండాలకు చెందిన 16 దేశాల జట్లు ….నాలుగు గ్రూపులుగా ఈ టోర్నీ లో తలపడ్డాయి.

మొత్తం నాలుగు గ్రూపుల నుంచి..ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికన్ విన్నర్ అర్జెంటీనా, ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, జర్మనీ, హాలెండ్ జట్లతో పాటు… ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం జట్లు సైతం నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టాయి.

నేడు, రేపు క్వార్టర్స్ వార్….

తొలి క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా తో ఇంగ్లండ్ , రెండో క్వార్టర్స్ లో ఆస్ట్రేలియాతో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక… గురువారం జరిగే మూడోక్వార్టర్ ఫైనల్లో జర్మనీతో బెల్జియం తలపడనుంది. గురువారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆఖరి క్వార్టర్ ఫైనల్లో హాలెండ్ కు భారత్ సవాల్ విసురుతోంది.

లీగ్ దశలో అజేయం భారత్….

సౌతాఫ్రికా, కెనడా, బెల్జియం జట్లతో కూడిన గ్రూప్ – సీ లీగ్ … తొలిరౌండ్లో సౌతాఫ్రికాను 5-0తో చిత్తు చేసిన భారత్… రెండో రౌండ్లో 3వ ర్యాంకర్ బెల్జియంతో మ్యాచ్ ను భారత్ 2-2తో డ్రాగా ముగించింది.

కెనడాతో జరిగిన ఆఖరిరౌండ్ ఆఖరి క్వార్టర్ లో భారత్ విశ్వరూపమే ప్రదర్శించింది. చివరకు5-1 గోల్స్ తో విజయం సాధించడం ద్వారా… అన్ బీటెన్ రికార్డుతో ….గ్రూప్ టాపర్ గా నాకౌట్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

అయితే… ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత్ …సెమీఫైనల్స్ చేరాలంటే …క్వార్టర్ ఫైనల్లో పవర్ ఫుల్ హాలెండ్ ను అధిగమించాల్సి ఉంది.

భారత్-హాలెండ్ జట్ల ఆఖరి క్వార్టర్స్ సమరం హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత… ప్రపంచకప్ అందుకోవాలని కలలు కంటున్న భారతజట్టు… ప్రస్తుత టోర్నీలో మరో మూడు విజయాలు సాధించగలిగితే….1975 తర్వాత మరోసారి విశ్వవిజేతగా నిలువగలుగుతుంది.