Telugu Global
NEWS

టీమిండియా-ఆస్ట్రేలియా రెండోటెస్ట్ కు పెర్త్ నయా స్టేడియం రెడీ

వాకా స్టేడియం వేదికగా 14 నుంచి రెండోటెస్ట్ సమరం రెండోటెస్టుకు ఫాస్ట్ , బౌన్సీ పిచ్ తో కంగారూల సవాల్ తొలిటెస్ట్ గెలుపుతో టీమిండియా నయాజోష్ టీమిండియా-ఆస్ట్రేలియాజట్ల నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ షో…. పెర్త్ నగరానికి చేరింది. ఫాస్టెస్ట్ వికెట్ గా పేరొందిన పెర్త్ నయా స్టేడియం పిచ్ వేదికగా…ఈనెల 14 నుంచి రెండోటెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. గతంలో పెర్త్ అనగానే వాకా స్టేడియం మాత్రమే గుర్తుకు వచ్చేది. అయితే…. కోట్ల డాలర్ల వ్యయంతో సరికొత్తగా నిర్మించిన పెర్త్ […]

టీమిండియా-ఆస్ట్రేలియా రెండోటెస్ట్ కు పెర్త్ నయా స్టేడియం రెడీ
X
  • వాకా స్టేడియం వేదికగా 14 నుంచి రెండోటెస్ట్ సమరం
  • రెండోటెస్టుకు ఫాస్ట్ , బౌన్సీ పిచ్ తో కంగారూల సవాల్
  • తొలిటెస్ట్ గెలుపుతో టీమిండియా నయాజోష్

టీమిండియా-ఆస్ట్రేలియాజట్ల నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ షో…. పెర్త్ నగరానికి చేరింది. ఫాస్టెస్ట్ వికెట్ గా పేరొందిన పెర్త్ నయా స్టేడియం పిచ్ వేదికగా…ఈనెల 14 నుంచి రెండోటెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. గతంలో పెర్త్ అనగానే వాకా స్టేడియం మాత్రమే గుర్తుకు వచ్చేది.

అయితే…. కోట్ల డాలర్ల వ్యయంతో సరికొత్తగా నిర్మించిన పెర్త్ స్టేడియానికి… ఆప్టస్ స్టేడియంగా నామకరణం చేశారు.

అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ లో 31 పరుగుల తేడాతో నెగ్గి 1-0 ఆధిక్యంతో పైచేయి సాధించిన టీమిండియా…. వరుసగా రెండో విజయంతో సిరీస్ పై పట్టుబిగించాలన్న పట్టుదలతో ఉంది.

రెండుజట్లూ ఫాస్ట్ బౌలింగే ప్రధాన ఆయుధంగా పేస్ వార్ కు సిద్ధమయ్యాయి. గత సిరీస్ లో…. పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 72 పరుగుల విజయం నమోదు చేసింది.

ప్రస్తుత సిరీస్ లో సైతం…. విరాట్ సేన అదేజోరు కొనసాగించగలనన్న ధీమాతో ఉంది. ఇక రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే…. ప్రస్తుత అడిలైడ్ టెస్ట్ వరకూ కంగారూ గడ్డపై ఆడిన మ్యాచ్ ల్లో టీమిండియా ఆరువిజయాలు మాత్రమే సాధించడం విశేషం.

గత ఏడుదశాబ్దాలుగా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ లు ఆడుతూ వస్తున్న టీమిండియా ఇప్పటి వరకూ ఒక్కసారీ సిరీస్ నెగ్గలేదు. అయితే ఆలోటును ప్రస్తుత సిరీస్ నెగ్గడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో విరాట్ అండ్ కో ఉన్నారు.

First Published:  12 Dec 2018 6:20 AM GMT
Next Story