Telugu Global
Cinema & Entertainment

రవితేజ గాలి తీసేసిన మాధవన్

అసలే వరుస ఫ్లాపులతో ఉన్నాడు రవితేజ. ఒప్పుకున్న సినిమా కూడా సెట్స్ పైకి రావడం లేదు. అవసరమా అనే ఆలోచనలో నిర్మాత కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి టైమ్ లో సినిమాకు హైప్ తీసుకురావడం కోసం ఓ గాపిస్ వదిలారు. రవితేజ, వీఐ ఆనంద్ సినిమాలో విలన్ గా మాధవన్ ను తీసుకుంటున్నారనేదే ఆ గాసిప్. ఈ న్యూస్ బయటకొచ్చిన తర్వాత ప్రాజెక్టుకు కాస్త హైప్ వచ్చింది. అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. కాకపోతే ఆ ఉత్సాహాన్ని ఇట్టే […]

రవితేజ గాలి తీసేసిన మాధవన్
X
అసలే వరుస ఫ్లాపులతో ఉన్నాడు రవితేజ. ఒప్పుకున్న సినిమా కూడా సెట్స్ పైకి రావడం లేదు. అవసరమా అనే ఆలోచనలో నిర్మాత కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి టైమ్ లో సినిమాకు హైప్ తీసుకురావడం కోసం ఓ గాపిస్ వదిలారు. రవితేజ, వీఐ ఆనంద్ సినిమాలో విలన్ గా మాధవన్ ను తీసుకుంటున్నారనేదే ఆ గాసిప్. ఈ న్యూస్ బయటకొచ్చిన తర్వాత ప్రాజెక్టుకు కాస్త హైప్ వచ్చింది. అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. కాకపోతే ఆ ఉత్సాహాన్ని ఇట్టే చల్లార్చాడు మాధవన్.
తనకు సంబంధించి టాలీవుడ్ లో ఇలా ఓ రూమర్ వచ్చిందని తెలిసిన వెంటనే మాధవన్ రియాక్ట్ అయ్యాడు. అలాంటిదేం లేదని కొట్టిపారేశాడు. సవ్యసాచి సినిమా తర్వాత ఇప్పటివరకు తెలుగులో తను మరో సినిమాకు కమిట్ అవ్వలేదని స్పష్టంచేశాడు మాధవన్. దీంతో రవితేజ, వీఐ ఆనంద్ సినిమా మరోసారి వెనక్కి వెళ్లిపోయింది.
వీళ్లిద్దరి కాంబోలో సినిమాను గ్రాండ్ గా ఎనౌన్స్ చేశాడు నిర్మాత రామ్ తళ్లూరి. కానీ అదే సమయంలో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇదొక్కటే కాదు, ఇంతకుముందు రవితేజ నటించిన సినిమాలు కూడా ఫ్లాప్స్ అనే విషయం తెలిసిందే. దీంతో రామ్ తళ్లూరి డైలమాలో పడ్డాడు. మరీ ముఖ్యంగా ఇది సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టు కావడంతో, భారీ బడ్జెట్ పెట్టడం అవసరమా అనే ఆలోచనలో పడిపోయాడు ఈ నిర్మాత.
First Published:  12 Dec 2018 11:10 AM GMT
Next Story