Telugu Global
Cinema & Entertainment

సస్పెన్స్ కు తెరదించిన 'ఎన్టీఆర్'

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఆడియో ఫంక్షన్ ను తిరుపతిలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారట. ట్రయిలర్ కోసం ఓ స్పెషల్ డేట్ ఫిక్స్ చేశారట. ఇలా ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్, ట్రయిలర్ రిలీజ్ పై చాలా ఊహాగానాలు నడిచాయి. ఎట్టకేలకు ఈ సస్పెన్స్ కు ఎన్టీఆర్ బయోపిక్ మేకర్స్ తెరదించారు. ఎన్టీఆర్ బయోపిక్ ట్రయిలర్ ను ఈనెల 16న హైదరాబాద్ లో రిలీజ్ చేయబోతున్నారు. 16న ఏ తేదీకి విడుదల చేస్తారనేది మరో 2 […]

సస్పెన్స్ కు తెరదించిన ఎన్టీఆర్
X

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఆడియో ఫంక్షన్ ను తిరుపతిలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారట. ట్రయిలర్ కోసం ఓ స్పెషల్ డేట్ ఫిక్స్ చేశారట. ఇలా ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్, ట్రయిలర్ రిలీజ్ పై చాలా ఊహాగానాలు నడిచాయి. ఎట్టకేలకు ఈ సస్పెన్స్ కు ఎన్టీఆర్ బయోపిక్ మేకర్స్ తెరదించారు.

ఎన్టీఆర్ బయోపిక్ ట్రయిలర్ ను ఈనెల 16న హైదరాబాద్ లో రిలీజ్ చేయబోతున్నారు. 16న ఏ తేదీకి విడుదల చేస్తారనేది మరో 2 రోజుల్లో ప్రకటిస్తారు. ఇక ఆడియో లాంఛ్ ను నిమ్మకూరులో ప్లాన్ చేశారు. 21వ తేదీన నిమ్మకూరులో నందమూరి అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ బయోపిక్ పాటల వేడుక ఉంటుంది.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 సింగిల్స్ విడుదలయ్యాయి. ఈ గ్యాప్ లో మరో సింగిల్ రిలీజ్ చేసి, మిగిలిన అన్ని పాటల్ని జ్యూక్ బాక్స్ రూపంలో 21న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో బిట్ సాంగ్స్, ఎన్టీఆర్ పాత పాటలతో కలుపుకొని మొత్తంగా 14 పాటలుంటాయట

First Published:  12 Dec 2018 5:55 AM GMT
Next Story