Telugu Global
NEWS

చంద్రబాబు వల్లే ఓడిపోయాం " పొంగులేటి

తెలంగాణలో మహాకూటమి ఓటమికి ఏఐసీసీ కారణం కానేకాదని పొంగులేటి సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. లోపం రాష్ట్ర నాయకత్వంలోనే ఉందన్నారు. సెంటిమెంట్‌ ఆధారంగా ఏర్పడిన రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేయడంలో రాష్ట్ర నాయకత్వం వైఫల్యం చెందిందని అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తును కూడా ఆయన సమర్ధించలేదు. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనుకున్న పరిస్థితుల్లో చంద్రబాబు రావడంతో సీన్‌ మారిపోయిందన్నారు. పోరును కేసీఆర్‌ వర్సెస్ చంద్రబాబుగా మార్చడంలో కేసీఆర్‌ సఫలమయ్యారని అందు వల్లే కూటమి ఓడిపోయిందన్నారు. ఏం మాయ జరిగిందో గానీ […]

చంద్రబాబు వల్లే ఓడిపోయాం  పొంగులేటి
X

తెలంగాణలో మహాకూటమి ఓటమికి ఏఐసీసీ కారణం కానేకాదని పొంగులేటి సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. లోపం రాష్ట్ర నాయకత్వంలోనే ఉందన్నారు. సెంటిమెంట్‌ ఆధారంగా ఏర్పడిన రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేయడంలో రాష్ట్ర నాయకత్వం వైఫల్యం చెందిందని అభిప్రాయపడ్డారు.

టీడీపీతో పొత్తును కూడా ఆయన సమర్ధించలేదు. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనుకున్న పరిస్థితుల్లో చంద్రబాబు రావడంతో సీన్‌ మారిపోయిందన్నారు. పోరును కేసీఆర్‌ వర్సెస్ చంద్రబాబుగా మార్చడంలో కేసీఆర్‌ సఫలమయ్యారని అందు వల్లే కూటమి ఓడిపోయిందన్నారు. ఏం మాయ జరిగిందో గానీ మొత్తానికి మహాకూటమి ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయని… కాబట్టి వెంటనే రాహుల్‌ గాంధీ రంగప్రవేశం చేయాలని పొంగులేటి కోరారు. రాష్ట్ర నాయకత్వం సరైన ప్రచారం చేయలేకపోవడం వల్లే రాష్ట్రం ఇచ్చినా సరే 2014లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు.

లోక్‌సభకు కోమటిరెడ్డి…

తెలంగాణలో మహాకూటమి విఫలమవడంపై త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి భవిష్యతు కార్యాచరణ రూపొందిస్తామని మునుగోడు నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తన అన్న వెంకటరెడ్డి ఓడిపోవడం బాధకలిగించిందన్నారు. అందుకే అభిమానులు సంబరాలు చేసుకోలేదన్నారు. మరో నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని… అప్పుడు వెంకటరెడ్డి లోక్‌సభకు పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తారని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. మునుగోడు, నకిరేకల్‌లో పార్టీ గెలుపుకు పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  12 Dec 2018 6:13 AM GMT
Next Story