Telugu Global
Cinema & Entertainment

రేపట్నుంచి మిస్టర్ మజ్ను హంగామా

అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 25న విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి రేపట్నుంచి అసలైన హంగామా మొదలుకానుంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ సినిమా నుంచి తొలి సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఇక రేపట్నుంచి దశలవారీగా పాటల్ని మార్కెట్లోకి తీసుకురానున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ […]

రేపట్నుంచి మిస్టర్ మజ్ను హంగామా
X

అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 25న విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి రేపట్నుంచి అసలైన హంగామా మొదలుకానుంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ సినిమా నుంచి తొలి సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఇక రేపట్నుంచి దశలవారీగా పాటల్ని మార్కెట్లోకి తీసుకురానున్నారు.

తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఏమైనదో అనే లిరిక్స్ తో సాగే మెలొడీని రేపు విడుదల చేయబోతున్నారు. నిజానికి టీజర్ లో భాగంగా చూపించిన మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్ ను రేపు రిలీజ్ చేస్తారని అంతా భావించారు. కానీ ఆ పాట బదులు, మెలొడీకి ప్రాధాన్యత ఇచ్చారు మేకర్స్. సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

కెరీర్ లో ఇప్పటివరకు సాలిడ్ హిట్ అందుకోలేకపోయాడు అఖిల్. మొదటి సినిమా డిజాస్టర్ కాగా, రెండో సినిమా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. అందుకే మూడో సినిమా మిస్టర్ మజ్నుపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు ఈ అక్కినేని హీరో.

First Published:  13 Dec 2018 7:31 AM GMT
Next Story