Telugu Global
Cinema & Entertainment

టైటిల్ కోసం శర్వానంద్ వెయిటింగ్

ప్రస్తుతం పడి పడి లేచే మనసు అనే సినిమా చేస్తున్నాడు శర్వానంద్. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 21న థియేటర్లలోకి రానుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈ సినిమా మేటర్ కాదు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా మేటర్ ఇది. ఈ సినిమా టైటిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది యూనిట్. సినిమాలో శర్వానంద్ రెండు షేడ్స్ లో కనిపిస్తున్నాడు. ఒక షేడ్ లో మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. […]

టైటిల్ కోసం శర్వానంద్ వెయిటింగ్
X
ప్రస్తుతం పడి పడి లేచే మనసు అనే సినిమా చేస్తున్నాడు శర్వానంద్. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 21న థియేటర్లలోకి రానుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈ సినిమా మేటర్ కాదు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా మేటర్ ఇది. ఈ సినిమా టైటిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది యూనిట్.
సినిమాలో శర్వానంద్ రెండు షేడ్స్ లో కనిపిస్తున్నాడు. ఒక షేడ్ లో మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. సినిమా అంతా దాదాపు సీరియస్ మూడ్ లోనే ఉంటుంది. హీరోయిజం పీక్స్ లో ఉంటుంది. ఇలాంటి కథకు టైటిల్ ఫిక్స్ చేయడం కత్తిమీద సాములాంటిది. అందుకే మేకర్స్ ఇప్పుడు డైలమాలో పడ్డారు. అగంతకుడు, క్రిమినల్ లాంటి 2-3 టైటిల్స్ చేతిలో ఉన్నప్పటికీ ఏదీ ఇంకా ఫిక్స్ చేయలేదు.
టైటిల్ ఖరారైన వెంటనే ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ కింద ఏ స్టిల్ ను విడుదల చేయాలనే విషయంపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసింది యూనిట్. ఇక టైటిల్ దొరకడమే ఆలస్యం. పడి పడి లేచే మనసు థియేటర్లలోకి వచ్చిన వెంటనే.. ఈ కొత్త సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చేస్తుంది.
First Published:  13 Dec 2018 7:47 AM GMT
Next Story