Telugu Global
Cinema & Entertainment

నాగ చైతన్య కి అత్తగా గ్లామర్ హీరోయిన్

అక్కినేని నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటిస్తున్న సినిమా “వెంకీ మామ”.  బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి… కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతుంది వచ్చింది.. ఇక ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ హ్యుమ కురేషి ని అనుకున్నాడు బాబీ, కానీ ఆమె ఆఖరి నిమిషం లో హ్యాండ్ ఇవ్వడంతో మళ్ళి టీం అందరూ టెన్షన్ […]

నాగ చైతన్య కి అత్తగా గ్లామర్ హీరోయిన్
X

అక్కినేని నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటిస్తున్న సినిమా “వెంకీ మామ”. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి… కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతుంది వచ్చింది.. ఇక ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ హ్యుమ కురేషి ని అనుకున్నాడు బాబీ, కానీ ఆమె ఆఖరి నిమిషం లో హ్యాండ్ ఇవ్వడంతో మళ్ళి టీం అందరూ టెన్షన్ లో పడ్డారు. అయితే ఆ టెన్షన్ నుంచి త్వరగా తేరుకొని వెంకీ కోసం ఒక హీరోయిన్ ని పట్టారు మూవీ యూనిట్.

అవును తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో హుమా ప్లేస్ లో శ్రియను కన్ఫార్మ్‌ చేశారట. వెంకీ, శ్రియ జతగా ఇంతకుముందు “సుభాష్‌ చంద్రబోస్” “గోపాల గోపాల” సినిమాల్లో జంటగా కనిపించారు. ఇప్పుడు మళ్ళి చాలా కాలం తరువాత ఈ కాంబో రిపీట్ కానుంది. సినిమా లో వెంకటేష్ చైతన్య కి మామ గా నటిస్తున్న విషయం తెలిసిందే, ఈ లెక్కన చూసుకుంటే శ్రియ చైతన్య కి అత్తగా నటిస్తుంది అనమాట. సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

First Published:  12 Dec 2018 10:12 PM GMT
Next Story