Telugu Global
NEWS

బాబు దెబ్బకు భస్మమైన ఆ నలుగురి ఖ్యాతి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘోర పరాజయం టీడీపీ, కాంగ్రెస్‌ నేతలకు తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా చేసింది. కాంగ్రెస్‌ మరీ ఈస్థాయిలో ఓడిపో్యిందంటే అందుకు చంద్రబాబుతో పొత్తే కారణమన్నది చాలా మంది అభిప్రాయం. చంద్రబాబుతో కలవడంతో మహాకూటమిలో కొందరు వ్యక్తులు కూడా తమ పరువును తగ్గించుకునే పరిస్థితి వచ్చింది. అందులో మొదటి వరుసలో గద్దర్ ఉంటారు. ఒకప్పుడు తన శరీరంలోకి బుల్లెట్లను దింపించిన చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయన పొట్టలో తలపెట్టడం ద్వారా గద్దర్ తన […]

బాబు దెబ్బకు భస్మమైన ఆ నలుగురి ఖ్యాతి
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘోర పరాజయం టీడీపీ, కాంగ్రెస్‌ నేతలకు తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా చేసింది. కాంగ్రెస్‌ మరీ ఈస్థాయిలో ఓడిపో్యిందంటే అందుకు చంద్రబాబుతో పొత్తే కారణమన్నది చాలా మంది అభిప్రాయం.

చంద్రబాబుతో కలవడంతో మహాకూటమిలో కొందరు వ్యక్తులు కూడా తమ పరువును తగ్గించుకునే పరిస్థితి వచ్చింది.

అందులో మొదటి వరుసలో గద్దర్ ఉంటారు. ఒకప్పుడు తన శరీరంలోకి బుల్లెట్లను దింపించిన చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయన పొట్టలో తలపెట్టడం ద్వారా గద్దర్ తన స్థాయిని కోల్పోయారన్న అభిప్రాయం ఉంది. ప్రజాయుద్ధనౌకగా కనిపించిన గద్దర్‌ వెళ్లి చంద్రబాబే రాజ్యాంగ రక్షకుడు అని కీర్తించడం చాలా మందిని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఫిరాయింపులను ప్రోత్సాహిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును రాజ్యాంగ రక్షకుడు అని కీర్తించడం ద్వారా గద్దర్ తన సిద్ధాంతాలను వదిలేసి రాజకీయ నాయకులతో పోటీ పడుతున్నారా అన్న ఆవేదన చాలా మందిలో కలిగింది.

కోదండరాంది ఇదే పరిస్థితి. కోదండరాం కాంగ్రెస్‌తో పొత్తుకు సై అన్నప్పుడు ఎవరూ తప్పుపట్టలేదు. కానీ చంద్రబాబుతో కలిసేందుకు సిద్ధపడినప్పుడు కోదండరాం పట్ల చాలా మంది విముఖత వ్యక్తం చేశారు. గతంలో ఒకానొక సమయంలో టీఆర్‌ఎస్, టీడీపీ దగ్గరవుతుంటే … తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కేసీఆర్‌ దోస్తి ఏమిటని ప్రశ్నించిన కోదండరామే తిరిగి చంద్రబాబుతో వేదిక పంచుకోవడం తెలంగాణ వాదుల్లో ఆయన్ను ఇష్టపడే వారికి కూడా నచ్చలేదు. బహుశా పోటీ చేసి ఉంటే కోదండరాం కూడా ఓటమి చవిచూసి ఉండేవారు కాబోలు.

ఇక చంద్రబాబు కోసం మహాకూటమికి ఊపు తెచ్చేందుకు లగడపాటి రాజగోపాల్ తన ఆక్టోపస్ అన్న పేరును అంతం చేసుకున్నారు. తన విశ్వసనీయతను మీడియా సాక్షిగా తాకట్టు పెట్టేశారు. నిజానికి లగడపాటి పోలింగ్ తర్వాతే ఫలితాలు చెప్పేవారు. కానీ ఈసారి మాత్రం పోలింగ్‌కు ముందు నుంచే మహాకూటమి గెలుస్తుందంటూ సర్వేలు చెబుతున్నాయని నమ్మించే ప్రయత్నం చేశారు.

చివరకు పోలింగ్ తర్వాత కూడా మహాకూటమే గెలుస్తుందని చెప్పారు. చంద్రబాబు కోసమే లగడపాటి అలా చెప్పారన్నది విమర్శ. మొత్తం మీద మహాకూటమి కోసం లగడపాటి ఇలా వాస్తవానికి దూరంగా సర్వే ఫలితాలు చెప్పడం ద్వారా తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారు. ఇకపై ఆయన ఆక్టోపస్‌ ఏ మాత్రం కాబోరు. ఇకపై నిజంగానే సర్వే ఫలితాలను చెప్పినా ఆయన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.

చంద్రబాబు ఆడిన రాజకీయంలో నందమూరి సుహాసిని కూడా బాధితురాలే. హఠాత్తుగా ఆమెను తెరపైకి తెచ్చి నందమూరి కుటుంబ పరువుకు పరీక్ష పెట్టారు. కూకట్‌పల్లిలో ఓటమి సుహాసినికే కాకుండా నందమూరి కుటుంబానికీ ఒకమచ్చలా మిగిలిపోయింది.

చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా సొంత ప్రజల ముందు నేరస్తుడిగా నిలబడాల్సి వచ్చింది. చంద్రబాబుతో పొత్తు లేకుంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ అని ప్రచారం చేసుకునేందుకైనా అవకాశం ఉండేది.

కానీ హైకమాండ్ పెద్దలు బాబు మాయలో పడిపోవడం, ఇక్కడి కాంగ్రెస్‌ నేతలకు నోరు లేకపోవడంతో చివరకు ఏ పాయింట్‌ మీద ఓట్లు అడగాలో కూడా తెలియక తికమక పడింది కాంగ్రెస్‌. దాని ఫలితం…. ఎందరో హేమాహేమీలు తమ ఓటమిని కానుకగా సమర్పించుకోవాల్సి వచ్చింది.

First Published:  13 Dec 2018 12:16 AM GMT
Next Story