Telugu Global
Cinema & Entertainment

ఇప్పుడు దేవరకొండ నిజంగానే "హీరో"

కొన్ని దశాబ్దాల కిందట హీరో టైటిల్ తో సినిమా చేశాడు మెగాస్టార్ చిరంజీవి. అప్పటికి ఆయన మెగాస్టార్ కాదుకదా, కనీసం సుప్రీమ్ హీరో కూడా కాదు. కానీ ఆ సినిమా చిరంజీవి స్టార్ ఇమేజ్ కు ఓ పునాది రాయిగా పనిచేసింది. ఇప్పుడు అదే టైటిల్ తో విజయ్ దేవరకొండ కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. త్వరలోనే అదే బ్యానర్ […]

ఇప్పుడు దేవరకొండ నిజంగానే హీరో
X

కొన్ని దశాబ్దాల కిందట హీరో టైటిల్ తో సినిమా చేశాడు మెగాస్టార్ చిరంజీవి. అప్పటికి ఆయన మెగాస్టార్ కాదుకదా, కనీసం సుప్రీమ్ హీరో కూడా కాదు. కానీ ఆ సినిమా చిరంజీవి స్టార్ ఇమేజ్ కు ఓ పునాది రాయిగా పనిచేసింది. ఇప్పుడు అదే టైటిల్ తో విజయ్ దేవరకొండ కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. త్వరలోనే అదే బ్యానర్ పై హీరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ మేరకు హీరో అనే టైటిల్ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చాన్నాళ్ల కిందటే రిజిస్టర్ చేయించడం విశేషం.

నిజానికి ఈ సినిమా ఒకటి రాబోతోందనే విషయం ఎవరికీ తెలియదు. దర్శకుడు ఎవరనే విషయాన్ని కూడా బయటపెట్టలేదు. ఈ సినిమాకు రామకృష్ణ ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేయబోతున్నాడు. అతడే మీడియాకు ఈ విషయాన్ని లీక్ చేశాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కంప్లీట్ అయిన వెంటనే, తిరిగి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హీరో ప్రాజెక్టు చేయబోతున్నాడు విజయ్.

First Published:  12 Dec 2018 9:58 PM GMT
Next Story