సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ పెద్దమనసు

  • 37వ పుట్టినరోజున యువీ అసాధారణ నిర్ణయం
  • 25 మంది క్యాన్సర్ పీడిత బాలల చికిత్సకు యువీ నిధులు

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ హిట్టర్… సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ తన పెద్ద మనసును చాటుకొన్నాడు. క్యాన్సర్ వ్యాధితో తాను పోరాడి విజేతగా నిలిచిన రోజులను… తన 37వ పుట్టిన రోజున గుర్తు చేసుకొన్నాడు. 

37వ పడిలోకి పడిన యువరాజ్ సింగ్… ఓ ఉదార నిర్ణయం తీసుకొన్నాడు.

క్రికెటర్ గా ఇప్పటికే వందలకోట్ల రూపాయలు ఆర్జించిన యువరాజ్…. తన సంపాదనలో కొంతభాగాన్ని సమాజసేవకు వినియోగించాలని నిర్ణయించాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 25 మంది బాలలకు…. తన ఖర్చుతో చికిత్స చేయించాలని నిర్ణయించాడు.

క్యాన్సర్ పై విజేత….

2011 ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన యువరాజ్ సింగ్…ఆ తర్వాత తనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించాడు. ఆ తర్వాత క్రికెట్ పోరాటాన్ని ఆపి… క్యాన్సర్ తో పోరాడి… అసలు సిసలు విజేతగా నిలిచాడు.

బోస్టన్, ఇండియానా పోలిస్ నగరాలలో క్యాన్సర్ వ్యాధికి అవసరమైన కీమోథెరపీ తీసుకొన్నాడు. ఆ అనుభవంతో క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా మారాడు.

సిక్సర్ల కింగ్….

టీ-20 ప్రపంచకప్ ఓమ్యాచ్ ఆరు బాల్స్ లో ఆరు సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు యువరాజ్ పేరుతోనే ఉంది. అంతేకాదు… టీమిండియా తరపున 304 వన్డేలు ఆడిన యువీకి… 8వేల 701 పరుగులతో పాటు…. 14 శతకాలు, 52 హాఫ్ సెంచరీలు సాధించిన అరుదైన రికార్డు ఉంది.