Telugu Global
NEWS

ఏపీ అసెంబ్లీ వద్ద ఆంక్షలు

అమరావతిలో ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. అసెంబ్లీలోకి మీడియా సిబ్బంది ప్రవేశంపై ఆంక్షలు విధించారు. సచివాలయ ఉద్యోగుల పైనా ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఆధార్‌ కార్డుతో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఇకపై అసెంబ్లీలోకి ప్రవేశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అసెంబ్లీ ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. సచివాలయం నుంచి నేరుగా అసెంబ్లీలోకి వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకే తాము ఈ ఆంక్షలు విధించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే […]

ఏపీ అసెంబ్లీ వద్ద ఆంక్షలు
X

అమరావతిలో ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. అసెంబ్లీలోకి మీడియా సిబ్బంది ప్రవేశంపై ఆంక్షలు విధించారు. సచివాలయ ఉద్యోగుల పైనా ఆంక్షలను అమలు చేస్తున్నారు.

ఆధార్‌ కార్డుతో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఇకపై అసెంబ్లీలోకి ప్రవేశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అసెంబ్లీ ద్వారం వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.

సచివాలయం నుంచి నేరుగా అసెంబ్లీలోకి వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకే తాము ఈ ఆంక్షలు విధించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సచివాలయంలోనూ పలు ఆంక్షలు ఉన్నాయి. సచివాలయం వద్దకు ప్రజలు నేరుగా వెళ్లలేని పరిస్థితి ఇప్పటికే ఉంది.

ఇప్పుడు మీడియా, ఉద్యోగులపై సైతం ఆంక్షలు పెట్టడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీని చూసేందుకు వచ్చే వారిని కూడా అనుమతించడం లేదు. గతంలో వర్షం కారణంగా అసెంబ్లీ, సచివాలయంలోకి నీరు రావడంతో చిత్రీకరించేందుకు మీడియా వెళ్లగా అడ్డుకున్నారు.

First Published:  14 Dec 2018 8:03 AM GMT
Next Story