Telugu Global
National

రాజస్తాన్ గెహ్లాట్‌ కే.... డిప్యూటీ సీఎంగా సచిన్ పైలెట్

రాజస్తాన్ చల్లబడింది. కాంగ్రెస్ గెలిచినా సీఎం రేసులో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ ల మధ్య అధిష్టానం రాజీ కుదిర్చింది. ప్రస్తుతానికి సీనియర్ అయిన అశోక్ గెహ్లాట్ కే రాజస్తాన్ సీఎం పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఎన్నికల్లో కీ రోల్ పోషించిన సచిన్ పైలెట్ ను బుజ్జగించి డిప్యూటీ సీఎం గా ప్రకటిస్తూ తాజాగా కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా వెల్లడించింది. అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రి చేయడాన్ని నిరసిస్తూ నిన్న కాంగ్రెస్ […]

రాజస్తాన్ గెహ్లాట్‌ కే.... డిప్యూటీ సీఎంగా సచిన్ పైలెట్
X

రాజస్తాన్ చల్లబడింది. కాంగ్రెస్ గెలిచినా సీఎం రేసులో నువ్వా నేనా అన్నట్టు తలపడ్డ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ ల మధ్య అధిష్టానం రాజీ కుదిర్చింది. ప్రస్తుతానికి సీనియర్ అయిన అశోక్ గెహ్లాట్ కే రాజస్తాన్ సీఎం పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఎన్నికల్లో కీ రోల్ పోషించిన సచిన్ పైలెట్ ను బుజ్జగించి డిప్యూటీ సీఎం గా ప్రకటిస్తూ తాజాగా కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా వెల్లడించింది.

అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రి చేయడాన్ని నిరసిస్తూ నిన్న కాంగ్రెస్ సానుభూతి పరులు రాజస్తాన్ లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. సచిన్ పైలెట్ ను సీఎంగా చేయాలని మెజార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. యువకుడు, అందరితో కలిసిపోయే సచిన్ పైలెట్ అయితేనే బాగుంటుందని నేతలు నిరసనలు తెలిపారు.

కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీనియర్ వైపే మొగ్గు చూపింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అశోక్ గెహ్లాట్ కు సీఎం పదవి ఇస్తున్నామని రాహుల్ చెప్పినట్టు సమాచారం. అదే సమయంలో సచిన్ పైలెట్ చిన్న బుచ్చుకోకుండా డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్రమంత్రి పదవి ఇస్తానని రాహుల్ ఒప్పించినట్టు సమాచారం.

సచిన్ పైలెట్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని…. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తానని తెలిపారు.

First Published:  14 Dec 2018 5:55 AM GMT
Next Story