Telugu Global
NEWS

పెర్త్ టెస్ట్ తొలిరోజునే టగ్-ఆఫ్-వార్

ఆస్ట్రేలియా 6 వికెట్లకు 277 పరుగులు హనుమ విహారికి రెండు వికెట్లు పెర్త్ టెస్ట్ తొలిరోజు ఆటలోనే… ఆతిథ్య ఆస్ట్రేలియాకు టీమిండియా పగ్గాలు వేసింది.  బ్యాటింగ్ కు అనువుగా ఉన్న పెర్త్ ఓపస్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ టెస్ట్ లో …టాస్ నెగ్గి…ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న కంగారూ టీమ్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 277 పరుగుల స్కోరుతో తొలిరోజు ఆటను ముగించింది. మూడు హాఫ్ సెంచరీలు…. ఆస్ట్రేలియా ఓపెనర్లు హారిస్ 70, ఆరోన్ ఫించ్ 50, షాన్ […]

పెర్త్ టెస్ట్ తొలిరోజునే టగ్-ఆఫ్-వార్
X
  • ఆస్ట్రేలియా 6 వికెట్లకు 277 పరుగులు
  • హనుమ విహారికి రెండు వికెట్లు

పెర్త్ టెస్ట్ తొలిరోజు ఆటలోనే… ఆతిథ్య ఆస్ట్రేలియాకు టీమిండియా పగ్గాలు వేసింది. బ్యాటింగ్ కు అనువుగా ఉన్న పెర్త్ ఓపస్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ టెస్ట్ లో …టాస్ నెగ్గి…ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న కంగారూ టీమ్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 277 పరుగుల స్కోరుతో తొలిరోజు ఆటను ముగించింది.

మూడు హాఫ్ సెంచరీలు….

ఆస్ట్రేలియా ఓపెనర్లు హారిస్ 70, ఆరోన్ ఫించ్ 50, షాన్ మార్ష్ 45, ట్రావిడ్ హెడ్ 58 పరుగులు సాధించడం ద్వారా తమజట్టును ఆదుకొన్నారు. టీమిండియా బౌలర్లలో ఇశాంత్ శర్మ, హనుమ విహారీ చెరో రెండు వికెట్లు, ఉమేశ్ యాదవ్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.

తుదిజట్టు లో హనుమ విహారి…

అంతకు ముందు టీమిండియా రెండు మార్పులతో తుదిజట్టును ప్రకటించింది. గాయాలపాలైన రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ ల స్థానంలో విహారి, ఉమేశ్ యాదవ్ లకు చోటు కల్పించారు. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో తొలిటెస్ట్ నెగ్గడం ద్వారా టీమిండియా ఇప్పటికే 1-0 ఆధిక్యం సంపాదించింది.

ఆసీస్ 10వ టెస్ట్ వేదిక…

ఆధునిక క్రికెట్ కు చిరునామా ఆస్ట్రేలియా టెస్ట్ వేదికల సంఖ్య పదికి చేరింది. టీమిండియాతో ప్రస్తుత సిరీస్ రెండోటెస్ట్ కు ఆతిథ్యమిస్తున్న పెర్త్ లోని నయా వేదిక ఆప్టస్ స్టేడియం…ఆస్ట్రేలియా సరికొత్త టెస్ట్ వేదికగా రికార్డుల్లో చేరింది.

మొత్తం 60వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఈ బహుళ క్రీడావేదికలో… క్రికెట్ తో పాటు… రగ్బీ, ఆస్ట్రేలియా ఫుట్ బాల్ లీగ్, రగ్బీ, సాకర్, రగ్బీ యూనియన్ లీగ్ పోటీలు నిర్వహించుకొనే వీలుంది.

అంతేకాదు… వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక స్టేడియం …రెండోటెస్టుకు వేదిక కావడంతో… ఇంతకు ముందు వరకూ ఉన్న వాకా స్టేడియం ఇక…అందమైన గతంగా మిగిలిపోనుంది.

First Published:  14 Dec 2018 5:34 AM GMT
Next Story