Telugu Global
Cinema & Entertainment

ఇద్దరు కుర్ర హీరోలని టెస్ట్ చేసే పనిలో హరీష్ శంకర్

స్టార్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ “దువ్వడా జగ్గన్నదం” సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. అయితే గత కొంత కాలంగా మాత్రం హరీష్ శంకర్ తమిళ రీమేక్ సినిమా అయిన “జిగర్తాండ”  ని రీమేక్ కి ప్లాన్ చేస్తున్నాడు అని తెలిసింది. అయితే ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో నటించడానికి ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒప్పుకున్నాడు. కానీ ఈ సినిమాలో మరో హీరో కి కూడా […]

ఇద్దరు కుర్ర హీరోలని టెస్ట్ చేసే పనిలో హరీష్ శంకర్
X

స్టార్ డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ “దువ్వడా జగ్గన్నదం” సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. అయితే గత కొంత కాలంగా మాత్రం హరీష్ శంకర్ తమిళ రీమేక్ సినిమా అయిన “జిగర్తాండ” ని రీమేక్ కి ప్లాన్ చేస్తున్నాడు అని తెలిసింది. అయితే ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో నటించడానికి ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒప్పుకున్నాడు. కానీ ఈ సినిమాలో మరో హీరో కి కూడా అవకాశం ఉంది. మాతృకత లో సిద్దార్థ్ ప్లే చేసిన రోల్ ని నాగ శౌర్య లేదా రాజ్ తరుణ్ తో చేయిద్దాం అని హరీష్ శంకర్ ప్లాన్.

హరీష్ శంకర్ కి అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. అదేంటంటే ఈ డైరెక్టర్ కి ఇద్దరు హీరోలు నచ్చారు అంట కానీ కథ ప్రకారం ఒక్కరికే అవకాశం ఇవ్వాలి. అందుకే ఇద్దరికి ఒక వర్క్ షాప్ పెట్టి ఇద్దరిలో ఒకర్ని సెలెక్ట్ చేయాలి అని హరీష్ శంకర్ ప్లాన్. మరి ఈ ఇద్దరి హీరోస్ లో ఏ హీరో హరీష్ శంకర్ కంట్లో పడతాడో చూడాలి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన ఇస్తాడు అంట హరీశ్ శంకర్.

First Published:  13 Dec 2018 11:10 PM GMT
Next Story