డచ్ దెబ్బకు భారత్ సెమీస్ ఆశలు తూచ్

  • హాకీ ప్రపంచకప్ క్వార్టర్స్ లోనే ముగిసిన భారత్ పోటీ
  • క్వార్టర్ ఫైనల్లో హాలెండ్ 2-1 గోల్స్ తో భారత్ కు షాక్
  • భారత ఆశలపై నీళ్లు చల్లిన డచ్ జట్టు

నాలుగు దశాబ్దాల విరామం తర్వాత…ప్రపంచకప్ హాకీ టైటిల్ సాధించాలన్న భారత్ ఆశలు…క్వార్టర్ ఫైనల్స్ లోనే ఆవిరయ్యాయి.

 భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న 2018 హాకీ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్ వన్ హాలెండ్ 2-1 గోల్స్ తో భారత్ కు చెక్ చెప్పింది.

1975 తర్వాత తొలిసారిగా సెమీస్ ఆడిన భారత్..ఆట 12వ నిముషంలోనే ఆకాశ్ దీప్ సింగ్ సాధించిన గోల్ తో 1-0 ఆధిక్యం సాధించింది.

 ఆ తర్వాత థియరీ బ్రింక్ మాన్ గోల్ తో …డచ్ జట్టు 1-1తో స్కోరును సమం చేయగలిగింది. ఆట 50వ నిముషంలో మింక్ వాన్ డెర్ సాధించిన గోల్ తో హాలెండ్ 2-1తో మ్యాచ్ నెగ్గి…సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది.

 ఇప్పటి వరకూ ప్రపంచకప్ టోర్నీల్లో… డచ్ జట్టుతో ఏడుసార్లు తలపడిన భారత్ కు..ఇది ఆరో ఓటమి. ఓవరాల్ గా హాలెండ్ తో 106 మ్యాచ్ లు ఆడిన భారత్…33 విజయాలు, 49 పరాజయాలు,  ఓ డ్రా రికార్డుతో ఉన్నాయి.