Telugu Global
Cinema & Entertainment

గీత ఆర్ట్స్ లో సినిమా చేయనంటున్న త్రివిక్రమ్?

 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుంది అని అందరికి తెలుసు. ఇప్పటికే త్రివిక్రమ్ ఒక లైన్ ని అల్లు అర్జున్ ని వినిపించాడు అంట. అల్లు అర్జున్ కి కూడా ఆ లైన్ నచ్చగానే వెంటనే గీత ఆర్ట్స్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అడ్వాన్స్ ఇప్పించే ప్రయత్నం చేసాడు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం గీత  ఆర్ట్స్ నుంచి వచ్చే అడ్వాన్స్ ని వద్దు అని చెప్పి […]

గీత ఆర్ట్స్ లో సినిమా చేయనంటున్న త్రివిక్రమ్?
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుంది అని అందరికి తెలుసు. ఇప్పటికే త్రివిక్రమ్ ఒక లైన్ ని అల్లు అర్జున్ ని వినిపించాడు అంట. అల్లు అర్జున్ కి కూడా ఆ లైన్ నచ్చగానే వెంటనే గీత ఆర్ట్స్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అడ్వాన్స్ ఇప్పించే ప్రయత్నం చేసాడు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం గీత ఆర్ట్స్ నుంచి వచ్చే అడ్వాన్స్ ని వద్దు అని చెప్పి హారిక హాసిని వాళ్ళు ప్రొడ్యూసర్స్ గా ఉంటేనే సినిమా చేస్తాను అంటున్నాడట.

గత కొంత కాలంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం హారిక హాసిని వాళ్ళతో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాని కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేయాలి అని త్రివిక్రమ్ వాదన, కానీ అల్లు అర్జున్ కి మాత్రం గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకేక్కాలని ఉంది. మరి ఈ ఇద్దరి లో ఎవరు కిందకి దిగి వస్తారో చూడాలి, ఒకవేళ ఎవ్వరు దిగి రాకపోతే త్రివిక్రమ్ వేరే హీరోతో సినిమా స్టార్ట్ చేసేస్తాడు.

First Published:  14 Dec 2018 3:19 AM GMT
Next Story