Telugu Global
NEWS

కేటీఆర్‌కు కీలక పదవి అప్పగించిన కేసీఆర్‌

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే హోంమంత్రిగా మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్‌ అలీని నియమించిన కేసీఆర్‌… పార్టీలోనూ కీలక మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా తన కుమారుడు కేటీఆర్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్‌ నియమించారు. ఈమేరకు పార్టీ ప్రకటన జారీ చేసింది. కేటీఆర్‌ పనితీరు, నిబద్దత టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేస్తాయని కేసీఆర్‌ భావిస్తున్నట్టు వెల్లడించారు. కొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు, మరికొన్నినెలల్లో లోక్‌సభ ఎన్నికలు […]

కేటీఆర్‌కు కీలక పదవి అప్పగించిన కేసీఆర్‌
X

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే హోంమంత్రిగా మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్‌ అలీని నియమించిన కేసీఆర్‌… పార్టీలోనూ కీలక మార్పులు చేస్తున్నారు.

ఇందులో భాగంగా తన కుమారుడు కేటీఆర్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేసీఆర్‌ నియమించారు. ఈమేరకు పార్టీ ప్రకటన జారీ చేసింది.

కేటీఆర్‌ పనితీరు, నిబద్దత టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేస్తాయని కేసీఆర్‌ భావిస్తున్నట్టు వెల్లడించారు. కొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు, మరికొన్నినెలల్లో లోక్‌సభ ఎన్నికలు వస్తుండడంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే బాధ్యతను కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించారు.

First Published:  13 Dec 2018 11:05 PM GMT
Next Story