Telugu Global
Cinema & Entertainment

టాప్ ఫామ్ లో తమన్

సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈమధ్య ప్రతి మూవీకి మంచి ట్యూన్స్ ఇస్తున్నాడు తమన్. ఇతడు కంపోజ్ చేసిన ట్యూన్స్ లో సినిమాకు కనీసం రెండైనా హిట్ అవుతున్నాయి. దీనికితోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడీ మ్యూజిక్ డైరక్టర్ మరోసారి తన మార్క్ చూపించాడు. మిస్టర్ మజ్ను ఫస్ట్ సింగిల్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అఖిల్ హీరోగా నటిస్తున్న మిస్టర్ మజ్ను సినిమాకు సంబంధించి ఇవాళ్టి నుంచి పాటల వేడుక […]

టాప్ ఫామ్ లో తమన్
X
సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈమధ్య ప్రతి మూవీకి మంచి ట్యూన్స్ ఇస్తున్నాడు తమన్. ఇతడు కంపోజ్ చేసిన ట్యూన్స్ లో సినిమాకు కనీసం రెండైనా హిట్ అవుతున్నాయి. దీనికితోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడీ మ్యూజిక్ డైరక్టర్ మరోసారి తన మార్క్ చూపించాడు. మిస్టర్ మజ్ను ఫస్ట్ సింగిల్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు.
అఖిల్ హీరోగా నటిస్తున్న మిస్టర్ మజ్ను సినిమాకు సంబంధించి ఇవాళ్టి నుంచి పాటల వేడుక షురూ అయింది. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ కు అంతా కనెక్ట్ అవుతున్నారు. అలా అని ఇది ఎంజాయ్ మెంట్ సాంగ్ కాదు. ఆల్ మోస్ట్ బ్రేకప్ సాంగ్ లాంటిది. అయినప్పటికీ ఈ పాటకు యూత్ కనెక్ట్ అయ్యారంటే అది తమన్ టాలెంట్.
అఖిల్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన మిస్టర్ మజ్ను సినిమా విడుదలకు సిద్ధమైంది. వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాను జనవరి 25న విడుదల చేయబోతున్నారు. కెరీర్ లో అఖిల్ కు ఇది మూడో సినిమా.
First Published:  14 Dec 2018 8:51 AM GMT
Next Story