శ్వేతబసు ప్రసాద్ పెళ్లి చేసుకుంది

కొత్తబంగారు లోకం సినిమాతో కుర్రకారును కట్టిపడేసిన శ్వేతబసు ప్రసాద్ పెళ్లి చేసుకుంది. ముంబయికి చెందిన ఫిలింమేకర్ రోహిత్ మిట్టల్ తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా అతడిని పెళ్లాడింది. బెంగాళీ సంప్రదాయంలో జరిగిన వివాహంతో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. పూణెలో వీళ్ల వివాహం జరిగింది.
పెళ్లికి ముందు ఇండోనేషియాలోని బాలిలో భారీ ఎత్తున బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది శ్వేతబసు ప్రసాద్. తనకు తెలిసిన వాళ్లందర్నీ బాలి తీసుకెళ్లి మరీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. ఆ పార్టీ జరిగిన కొన్ని రోజులకే శ్వేత-రోహిత్ పెళ్లితో ఒక్కటయ్యారు.
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఆమెకు ఎలాంటి ఆఫర్లు రావడం లేదు. కొన్ని సీ-గ్రేడ్ హిందీ సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ చేస్తోందామె. వీటితో పాటు పలు ప్రాజెక్టులకు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేస్తోంది.