Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ కు సంకల్ప్ రెడ్డి

టాలీవుడ్ కు చెందిన డైరక్టర్లు హిందీకి వెళ్లి సినిమాలు చేయడం కొత్తకాదు. ఒకప్పటి రాఘవేంద్రరావు నుంచి పూరి జగన్నాధ్, క్రిష్  వరకు చాలామంది బాలీవుడ్ కు వెళ్లి సినిమాలు చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి దర్శకుడు సంకల్ప్ రెడ్డి కూడా చేరిపోయాడు. ప్రస్తుతం అంతరిక్షం సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్న ఈ డైరక్టర్, తన నెక్ట్స్ ప్రాజెక్టును బాలీవుడ్ లో ఫిక్స్ చేశాడు. “ఆర్.ఎస్.సిప్పీ, విపుల్ షా ప్రొడక్షన్స్ లో 2 సినిమాలు అనుకుంటున్నాను. నేను […]

బాలీవుడ్ కు సంకల్ప్ రెడ్డి
X
టాలీవుడ్ కు చెందిన డైరక్టర్లు హిందీకి వెళ్లి సినిమాలు చేయడం కొత్తకాదు. ఒకప్పటి రాఘవేంద్రరావు నుంచి పూరి జగన్నాధ్, క్రిష్ వరకు చాలామంది బాలీవుడ్ కు వెళ్లి సినిమాలు చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి దర్శకుడు సంకల్ప్ రెడ్డి కూడా చేరిపోయాడు. ప్రస్తుతం అంతరిక్షం సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్న ఈ డైరక్టర్, తన నెక్ట్స్ ప్రాజెక్టును బాలీవుడ్ లో ఫిక్స్ చేశాడు.
“ఆర్.ఎస్.సిప్పీ, విపుల్ షా ప్రొడక్షన్స్ లో 2 సినిమాలు అనుకుంటున్నాను. నేను ఇప్పుడు అక్కడ సినిమా తీయడానికి వెళ్తే అక్కడే రెండేళ్లు పడుతుంది. అందరికీ కథ చెప్పాలి, కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకోవాలి. హీరోలు ఎవరికీ ఇంకా కథలు చెప్పలేదు”
ఇలా తన బాలీవుడ్ డెబ్యూపై స్పందించాడు సంకల్ప్. అయితే ప్రాజెక్టుకు రెండేళ్లు పడితే మాత్రం బాలీవుడ్ కు గ్యాప్ ఇస్తానని, ఆ గ్యాప్ లో అంతరిక్షం సినిమాకు సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు సంకల్ప్. సీక్వెల్ లో కూడా వరుణ్ తేజ్ హీరోగా ఉంటాడని, ప్రొడక్షన్ హౌజ్ కూడా మారదని స్పష్టంచేశాడు. సంకల్ప్ మాటలు చూస్తుంటే.. బాలీవుడ్ ప్రాజెక్టు కంటే ముందే అంతరిక్షం-2ను సెట్స్ పైకి తీసుకొచ్చేలా ఉన్నాడు.
First Published:  14 Dec 2018 9:28 PM GMT
Next Story