Telugu Global
National

మందుబాబులూ బీకేర్ ఫుల్.... తనిఖీలకు సహకరించకపోతే....

డ్రంకన్ డ్రైవ్…. మద్యం సేవించి వాహనం నడిపితే ప్రమాదకరం. వాహనం నడుపుతున్న వారికే కాదు… రోడ్డుపై వెళ్లే వారికి కూడా ప్రమాదమే. ఈ డ్రంకన్ డ్రైవింగ్ ను నివారించేందుకు పోలీసులు చేస్తున్న తనిఖీల్లో మందుబాబులు చిందులు వేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు కొన్నిసందర్భాల్లో అవమానాలకు గురికావాల్సి వస్తుంది. మద్యం మత్తులో కొందరు వాహనాదారులు చేస్తున్న చేష్టలకు ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకాలతో పాటు… వారిపై దాడులకు సైతం దిగుతున్నారు. దీంతో ట్రాఫిక్ […]

మందుబాబులూ బీకేర్ ఫుల్.... తనిఖీలకు సహకరించకపోతే....
X

డ్రంకన్ డ్రైవ్…. మద్యం సేవించి వాహనం నడిపితే ప్రమాదకరం. వాహనం నడుపుతున్న వారికే కాదు… రోడ్డుపై వెళ్లే వారికి కూడా ప్రమాదమే.

ఈ డ్రంకన్ డ్రైవింగ్ ను నివారించేందుకు పోలీసులు చేస్తున్న తనిఖీల్లో మందుబాబులు చిందులు వేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు కొన్నిసందర్భాల్లో అవమానాలకు గురికావాల్సి వస్తుంది.

మద్యం మత్తులో కొందరు వాహనాదారులు చేస్తున్న చేష్టలకు ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకాలతో పాటు… వారిపై దాడులకు సైతం దిగుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తోంది.

ఇలాంటి ఘటనలపై చట్టపరంగా వెళ్లేందుకు సిద్దమయ్యారు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్న సమయంలో ఎవరైనా మద్యం మత్తులో పోలీసులపై దాడులకు పాల్పడినట్లయితే…. వారిపై నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేసేందుకు రెడీ అయ్యారు.

తనిఖీల సమయంలో ఎవరైనా సరే… పోలీసులతో గొడవలకు దిగితే వారిపై సెక్షన్ 353 ప్రకారం (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకాలు కల్పించడం) కింద కేసులను నమోదు చేయనున్నారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైనట్లయితే…. రెండు సంవత్సర జైలు శిక్షతోపాటు జరిమానా కూడా ఉంటుంది. అంతేకాదు నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్ కావడంతో బెయిల్ కూడా కష్టమే.

ఇదంతా వాహనదారుల భద్రతను కాపాడేందుకే అని చెబుతున్నారు పోలీసులు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో ఈ ఏడాది… ఇప్పటి వరకు 5వేల కేసులు నమోదు అయ్యాయి.

First Published:  16 Dec 2018 4:25 AM GMT
Next Story