Telugu Global
NEWS

బాబు హవాలా.... కొండా మురళీ, నామాలను విచారించనున్న పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ధన ప్రవాహం నడిచింది. వేల కోట్లను కుమ్మరించారు. మహాకూటమికి చంద్రబాబు ఆర్థిక హస్తంగా నిలబడ్డారు. కూటమి అభ్యర్థులకు భారీగా చంద్రబాబు డబ్బులు పంపించడంతో పాటు… కూటమి ప్రచారం ఖర్చు మొత్తం టీడీపీ అధినేతే భరించారని నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వందల కోట్లను హవాలా మార్గంలో ఎన్నికల వేళ తెలంగాణలోకి పంప్ చేశారు. ఇలా చేస్తూ హైదరాబాద్‌కు చెందిన హవాలా వ్యాపారి కీర్తి కుమార్ వరంగల్‌ పోలీసులకు పట్టుపడ్డారు. […]

బాబు హవాలా.... కొండా మురళీ, నామాలను విచారించనున్న పోలీసులు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ధన ప్రవాహం నడిచింది. వేల కోట్లను కుమ్మరించారు. మహాకూటమికి చంద్రబాబు ఆర్థిక హస్తంగా నిలబడ్డారు. కూటమి అభ్యర్థులకు భారీగా చంద్రబాబు డబ్బులు పంపించడంతో పాటు… కూటమి ప్రచారం ఖర్చు మొత్తం టీడీపీ అధినేతే భరించారని నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.

వందల కోట్లను హవాలా మార్గంలో ఎన్నికల వేళ తెలంగాణలోకి పంప్ చేశారు. ఇలా చేస్తూ హైదరాబాద్‌కు చెందిన హవాలా వ్యాపారి కీర్తి కుమార్ వరంగల్‌ పోలీసులకు పట్టుపడ్డారు. వరంగల్‌ జిల్లాకు రూ. 5.8 కోట్లు తరలిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పోలీసులు విచారణలో కీర్తి కుమార్ అనేక సంచలన విషయాలు వెల్లడించారు. రూ. 5.8 కోట్ల సొమ్మును మహాకూటమి అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, కొండా సురేఖ, వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్ర కోసం తీసుకొచ్చినట్టు హవాలా వ్యాపారి అంగీకరించారు.

సింగపూర్‌లోని ఒక వ్యక్తి ఈ సొమ్మును హవాలా ద్వారా చెన్నైకి పంపినట్టు పోలీసులు గుర్తించారు. చెన్నై నుంచి కీర్తికుమార్ ఈ డబ్బును తెలంగాణకు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో సింగపూర్‌లోని వ్యక్తి ఎవరు? ఆ సింగపూర్‌ వ్యక్తికి డబ్బులు పంపాల్సిందిగా ఆదేశించిన తెలుగు నాయకుడు ఎవరు అన్న దానిపై కూపీ లాగుతున్నారు. పలానా హవాలా వ్యక్తి ద్వారా డబ్బు అందుతుందని నామా, కొండా మురళీ, రవిచంద్రకు ముందుగానే కూటమి పెద్దల నుంచి సందేశం అందినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే నామా, కొండా మురళీ, రవిచంద్రను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ముగ్గురికి త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. నామా నాగేశ్వరరావు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ హవాలా సొమ్ము చంద్రబాబు ఆదేశాల మేరకు వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  16 Dec 2018 2:14 AM GMT
Next Story