Telugu Global
Cinema & Entertainment

మరో సినిమాకు ఓకే చెప్పిన నితిన్

ప్రస్తుతం నితిన్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమా చేయాలి. అయితే ఆ సినిమా ఇంతవరకు పట్టాలపైకి రాలేదు. ఈ గ్యాప్ లో మరో సినిమాను ఫైనల్ చేశాడు నితిన్. తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాట్ససన్ (రాక్షసుడు) అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ హీరో. ఈ సినిమా నితిన్ కు ఎంతలా నచ్చిందంటే, స్వయంగా ఈ సినిమా రీమేక్ రైట్స్ ను […]

మరో సినిమాకు ఓకే చెప్పిన నితిన్
X

ప్రస్తుతం నితిన్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ అనే సినిమా చేయాలి. అయితే ఆ సినిమా ఇంతవరకు పట్టాలపైకి రాలేదు. ఈ గ్యాప్ లో మరో సినిమాను ఫైనల్ చేశాడు నితిన్.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాట్ససన్ (రాక్షసుడు) అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ హీరో. ఈ సినిమా నితిన్ కు ఎంతలా నచ్చిందంటే, స్వయంగా ఈ సినిమా రీమేక్ రైట్స్ ను తనే దక్కించుకున్నాడు. తమిళ మేకర్స్ కు కళ్లుచెదిరే మొత్తం ఇచ్చి రీమేక్స్ రైట్స్ తన పేరు మీద రాయించుకున్నాడు.

ఇప్పుడీ ప్రాజెక్టును సుధీర్ వర్మ చేతిలో పెట్టాడు నితిన్. క్రైం థ్లిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది రాట్ససన్ సినిమా. ఇలాంటి కథల్ని సుధీర్ వర్మ బాగా హ్యాండిల్ చేస్తాడు. అందుకే అతడిని ఈ అవకాశం వరించింది.

ప్రస్తుతానికి ఈ తమిళ కథకు మార్పుచేర్పులు చేసే పనిలో బిజీగా ఉన్నాడు సుధీర్ వర్మ. భీష్మ సినిమా సెట్స్ పైకి వచ్చిన వెంటనే ఈ తమిళ రీమేక్ పై ఓ ప్రకటన రానుంది.

First Published:  16 Dec 2018 12:19 PM GMT
Next Story