Telugu Global
NEWS

హాకీ ప్రపంచకప్ ఫైనల్స్ కు ప్రధాన అతిథిగా మాస్టర్ సచిన్

కళింగ స్టేడియం వేదికగా నేడే టైటిల్ సమరం తొలిసారిగా ఫైనల్లో 3వ ర్యాంకర్ బెల్జియం ఒడిషా ప్రభుత్వం స్పాన్సర్ గా 2018 ప్రపంచకప్ హాకీ… 2018 ప్రపంచకప్ హాకీ ఫైనల్స్ కు… భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్ టెండుల్కర్… ముఖ్యఅతిథిగా హాజరు కానున్నాడు. టోర్నీ స్పాన్సర్ ఒడిషా ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానంపై… సచిన్ ఆదివారం భువనేశ్వర్ రానున్నాడు. ఒడిషా ప్రభుత్వం …భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. గత 18 రోజులుగా నిర్వహిస్తూ వస్తున్న […]

హాకీ ప్రపంచకప్ ఫైనల్స్ కు ప్రధాన అతిథిగా మాస్టర్ సచిన్
X
  • కళింగ స్టేడియం వేదికగా నేడే టైటిల్ సమరం
  • తొలిసారిగా ఫైనల్లో 3వ ర్యాంకర్ బెల్జియం
  • ఒడిషా ప్రభుత్వం స్పాన్సర్ గా 2018 ప్రపంచకప్ హాకీ…

2018 ప్రపంచకప్ హాకీ ఫైనల్స్ కు… భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్ టెండుల్కర్… ముఖ్యఅతిథిగా హాజరు కానున్నాడు. టోర్నీ స్పాన్సర్ ఒడిషా ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానంపై… సచిన్ ఆదివారం భువనేశ్వర్ రానున్నాడు.

ఒడిషా ప్రభుత్వం …భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. గత 18 రోజులుగా నిర్వహిస్తూ వస్తున్న ఈటోర్నీలో 16 దేశాల జట్లు…నాలుగు గ్రూపులుగా… లీగ్ కమ్ క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ గా నిర్వహించిన ఈ పోటీల క్వార్టర్ ఫైనల్లోనే ఆతిథ్య భారత్ పోటీ ముగియడంతో అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది.

మరోవైపు… ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా, 3వ ర్యాంకర్ బెల్జియం, ఇంగ్లండ్, హాలెండ్ జట్లు సెమీస్ కు చేరుకోగా…. తొలి సెమీ ఫైనల్లో బెల్జియం 6-0 గోల్స్ తో ఇంగ్లండ్ ను చిత్తు చేసి…. తొలిసారిగా టైటిల్ సమరానికి బెర్త్ ఖాయం చేసుకొంది.

బెల్జియం భళా…..

ఆధునిక హాకీలో అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా పేరుపొందిన బెల్జియం… స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ …తొలిసారిగా ప్రపంచకప్ హాకీ టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది.

క్వార్టర్ ఫైనల్లో జర్మనీ లాంటి పవర్ ఫుల్ జట్టును 2-1 గోల్స్ తో అధిగమించిన బెల్జియం…సెమీఫైనల్లో మాత్రం విశ్వరూపమే ప్రదర్శించింది.

రియో ఒలింపిక్స్ ఫైనలిస్ట్ గా, సిల్వర్ మెడలిస్ట్ గా ఉన్న బెల్జియం… సెమీస్ లో ఇంగ్లండ్ ను 6-0 గోల్స్ తో ఊదిపారేసింది.

ఏకపక్షంగా తొలి సెమీస్ పోరు….

ఏకపక్షంగా సాగిన ఈపోటీ నాలుగు క్వార్టర్లలోనూ బెల్జియం జోరే కొనసాగింది. బంతిని తమ అధీనంలోనే ఉంచుకోడమే కాదు…వచ్చిన అవకాశాలను బెల్జియం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొంది.

ఆట 15, 19 నిముషాలలో సాధించిన గోల్స్ తో బెల్జియం 2-0తో పైచేయి సాధించింది. ఆట తర్వాత ఆట 42, 44, 45 నిముషాలలో బెల్జియం మరో మూడు గోల్స్ నమోదు చేయడంతో ఆధిక్యత 5-0కు చేరింది.

ఆట 53వ నిముషంలో సాధించిన గోల్ తో బెల్జియం మ్యాచ్ ను 6-0 గోల్స్ తో ముగించి మరోసారి సత్తా చాటుకొంది.

ఇవీ ప్రపంచకప్ రికార్డులు….

హాకీ పురుషుల విభాగంలో 1971 నుంచే ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రారంభ ప్రపంచకప్ హాకీలో కాంస్య పతకం మాత్రమే సాధించిన భారత్…ఆ తర్వాత రెండేళ్లకు 1973లో నిర్వహించిన రెండో ప్రపంచకప్ లో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకొంది.

1975లో మలేసియా వేదికగా ముగిసిన మూడో ప్రపంచకప్ హాకీ టోర్నీలో…భారత్ తొలిసారిగా ట్రోఫీ అందుకొంది. అజిత్ పాల్ సింగ్ నాయకత్వంలోని భారతజట్టు విజేతగా నిలిచింది.

ఆ తర్వాత 1978 నుంచి 2014 వరకూ జరిగిన పది ప్రపంచకప్ టోర్నీల్లోనూ..భారత్ కు ఘోర పరాజయాలే ఎదురయ్యాయి.

నాలుగుజట్ల అరుదైన రికార్డు…

1971 నుంచి 2014 వరకూ జరిగిన మొత్తం 13 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న ఘనతను భారత్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్ జట్లు మాత్రమే దక్కించుకోగలిగాయి. ఓవరాల్ గా చూస్తే మాత్రం…. ఇప్పటి వరకూ 25 దేశాలజట్లకు మాత్రమే ప్రపంచకప్ బరిలోకి దిగిన రికార్డు ఉంది.

1978 ప్రపంచకప్ లో ఆరో స్థానానికి పడిపోయిన భారత్..1982లో ఐదు, 1986 ప్రపంచకప్ లో 12 స్థానాలకే పరిమితమయ్యింది. 1990 ప్రపంచకప్ లో 10వ స్థానం సంపాదించిన భారత్…. 1994 ప్రపంచకప్ లో పుంజుకొని 5వ స్థానానికి ఎకబాక గలిగింది.

1998 ప్రపంచకప్ లో నాలుగు, 2002 ప్రపంచకప్ లో 10, 2006 ప్రపంచకప్ లో 11 స్థానాలు సాధించిన భారత హాకీ… 2010 టోర్నీలో ఎనిమిది, 2014 ప్రపంచకప్ లో 9 స్థానాలలో నిలువగలిగింది.

2018 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా… 5 నుంచి 8 స్థానాలలో నిలిచే అవకాశం దక్కించుకొంది.

పాకిస్థాన్ జట్టే టాప్….

1971 నుంచి 2014 వరకూ మొత్తం 13సార్లు ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తే…అత్యధికంగా పాకిస్తాన్ జట్టు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. అయితే…2018 ప్రపంచకప్ కు మాత్రం అర్హత సాధించలేకపోయింది.

ప్రపంచకప్ లో భాగంగా 2014 టోర్నీ వరకూ మొత్తం 569 మ్యాచ్ లు జరిగితే…2వేల 276 గోల్స్ నమోదయ్యాయి. సగటున మ్యాచ్ కు నాలుగు గోల్స్ నమోదు కావడం విశేషం.

అత్యధికంగా నెదర్లాండ్స్ జట్టు 93 మ్యాచ్ లు ఆడితే…అత్యధిక విజయాలు సాధించిన జట్టు ఘనతను ఆస్ట్రేలియా సొంతం చేసుకొంది. కంగారూజట్టు 63 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 276 గోల్స్ సాధించడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ జట్టుగా రికార్డుల్లో చేరింది.

First Published:  15 Dec 2018 7:20 PM GMT
Next Story