తప్పులో కాలేసిన సచిన్…. కశ్యప్ అనుకుని కిడాంబిని….

టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఘోర తప్పిదం చేశారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సైనా నెహ్వాల్-పారుపల్లి కశ్యప్ లకు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో తప్పులో కాలేశారు.

మరో షట్లర్ కిడాంబి శ్రీకాంత్-సైనా కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ వివాహ శుభాకాంక్షలు తెలిపాడు సచిన్. ఇది గమనించిన ట్విట్టర్ యూజర్లు….”సార్ మీరు పొరబడ్డారు” అంటూ ట్వీట్లతో హోరెత్తించారు.

దీంతో తప్పును తెలుసుకున్న సచిన్ వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. తరువాత సైనా – కశ్యప్ లకు వివాహ శుభాకాంక్షలు తెలిపాడు.