Telugu Global
Cinema & Entertainment

టాప్-10లో ఆ రెండు సినిమాలు

సినిమా రేటింగ్స్ లో imdbకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ సంస్థ నేరుగా రేటింగ్స్ ఇవ్వదు. యూజర్లు ఇచ్చిన రివ్యూలు, రేటింగ్స్ ను క్రోడికరించి, వాటి సగటును మాత్రమే చూపిస్తుంది. అందుకే ఈ రేటింగ్స్ కు మంచి విశ్వసనీయత ఉంటుంది. ప్రతి ఏడాది టాప్-10 మూవీస్ ను విడుదల చేసే ఈ సంస్థ, ఈ ఏడాది కూడా టాప్-10 మూవీస్ ను విడుదల చేసింది. ఈ ఏడాది టాప్-10 లిస్ట్ లో మహానటి, రంగస్థలం సినిమాలు […]

టాప్-10లో ఆ రెండు సినిమాలు
X

సినిమా రేటింగ్స్ లో imdbకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ సంస్థ నేరుగా రేటింగ్స్ ఇవ్వదు. యూజర్లు ఇచ్చిన రివ్యూలు, రేటింగ్స్ ను క్రోడికరించి, వాటి సగటును మాత్రమే చూపిస్తుంది. అందుకే ఈ రేటింగ్స్ కు మంచి విశ్వసనీయత ఉంటుంది. ప్రతి ఏడాది టాప్-10 మూవీస్ ను విడుదల చేసే ఈ సంస్థ, ఈ ఏడాది కూడా టాప్-10 మూవీస్ ను విడుదల చేసింది.

ఈ ఏడాది టాప్-10 లిస్ట్ లో మహానటి, రంగస్థలం సినిమాలు స్థానం దక్కించుకున్నాయి. రేటింగ్ పరంగా లిస్ట్ లో రంగస్థలం 7వ స్థానంలో నిలిస్తే, మహానటి సినిమా 4వ స్థానం దక్కించుకోవడం విశేషం. గీతగోవిందం సినిమా టాప్-10 లో చోటు దక్కించుకోలేకపోయింది.

ఇదే లిస్ట్ లో గతేడాది 3 తెలుగు సినిమాలు స్థానం దక్కించుకున్నాయి. అర్జున్ రెడ్డి, బాహుబలి-2, ఘాజి సినిమాలు లిస్ట్ లో నిలిచాయి. ఈ ఏడాది మాత్రం కేవలం 2 సినిమాలకే చోటు దక్కింది. ఇక లిస్ట్ లో మొదటి స్థానంలో అంధాధున్ నిలవగా, ఆఖరి స్థానంలో సంజు నిలిచింది. ఎప్పట్లానే ఈ ఏడాది కూడా లిస్ట్ లో హిందీ సినిమాలదే డామినేషన్.

First Published:  16 Dec 2018 2:44 AM GMT
Next Story