Telugu Global
NEWS

భార్యకు చెప్పులు తొడిగిన ధోని

భారత క్రికెట్ జట్టు అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకటి. ధోని రికార్డులకే రారాజు. కొన్నేళ్లుగా భారత దేశ క్రికెట్ అభిమానుల కలలను నిజం చేస్తూ వరల్డ్‌కప్ సాధించి పెట్టిన కెప్టెన్ ధోని… ఫీల్డ్ లో ఉంటే ఆఖరి బాల్ వరకు ఇండియా చేతుల్లో విజయం ఉన్నట్టే. చాలా సార్లు క్రికెట్ ఫ్యాన్స్ ని తల ఎత్తుకునేలా చేసిన ధోని…. భార్య ముందు మాత్రం తల దించుకున్నాడు. ఇంతకీ విషయంలోకి వెళ్తే… ఎంఎస్ […]

భార్యకు చెప్పులు తొడిగిన ధోని
X

భారత క్రికెట్ జట్టు అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకటి. ధోని రికార్డులకే రారాజు. కొన్నేళ్లుగా భారత దేశ క్రికెట్ అభిమానుల కలలను నిజం చేస్తూ వరల్డ్‌కప్ సాధించి పెట్టిన కెప్టెన్ ధోని… ఫీల్డ్ లో ఉంటే ఆఖరి బాల్ వరకు ఇండియా చేతుల్లో విజయం ఉన్నట్టే.

చాలా సార్లు క్రికెట్ ఫ్యాన్స్ ని తల ఎత్తుకునేలా చేసిన ధోని…. భార్య ముందు మాత్రం తల దించుకున్నాడు. ఇంతకీ విషయంలోకి వెళ్తే… ఎంఎస్ ధోనీ మనకు అద్భుతమైన క్రికెటర్ గా మాత్రమే తెలుసు. కానీ అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సాక్షి కి మాత్రం ఒక మంచి భర్త, అలాగే కూతురు జీవా కు ఒక మంచి తండ్రి కూడా.

తన భార్య పై ఉన్న ప్రేమను మరొకసారి చాటి చెప్పిన ధోని… మళ్ళీ అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. సాక్షి సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో సాక్షి నిలబడి ఉండగా, ధోనీ ఆమెకు చెప్పులు తొడుగుతూ కనిపించాడు. ‘‘షూస్‌కి డబ్బులు నువ్వే కట్టావుగా, కాబట్టి నువ్వే వాటిని నాకు తొడుగు’’ అంటూ క్యాప్షన్ పెట్టింది సాక్షి.

కొందరు…. ఇలాంటి ప్రేమించే భర్త ఎవరికైనా దొరుకుతాడా అంటూ ఫొటోలకు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం బయట ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఇంట్లో మాత్రం భార్య చాటు భర్తే అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇక కొందరేమో ధోని భారత దేశ క్రికెట్ జట్టుకు మాత్రమే మాజీ కెప్టెన్, ఇంట్లో మాత్రం సాక్షి నే కెప్టెన్ అంటూ ఫొటోలకు కామెంట్స్ పెడుతున్నారు.

First Published:  17 Dec 2018 3:35 AM GMT
Next Story