Telugu Global
Cinema & Entertainment

నాగశౌర్య సరసన నిధి అగర్వాల్

బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తోంది నిధి అగర్వాల్. సవ్యసాచి థియేటర్లలోకి రాకుండానే మిస్టర్ మజ్నులో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడా సినిమా కూడా విడుదల కాకుండానే మరో సినిమా ఛాన్స్ దక్కించుకుంది. నాగశౌర్య అప్ కమింగ్ మూవీలో హీరోయిన్ గా నటించబోతోంది ఈ బెంగళూరు బ్యూటీ. సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన కాశీ విశాల్ అనే రచయిత దర్శకుడిగా మారాడు. నాగశౌర్యను హీరోగా పెట్టి ఓ రొమాంటిక్ ఎఁటర్ టైనర్ ప్లాన్ చేశాడు. […]

నాగశౌర్య సరసన నిధి అగర్వాల్
X

బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తోంది నిధి అగర్వాల్. సవ్యసాచి థియేటర్లలోకి రాకుండానే మిస్టర్ మజ్నులో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడా సినిమా కూడా విడుదల కాకుండానే మరో సినిమా ఛాన్స్ దక్కించుకుంది. నాగశౌర్య అప్ కమింగ్ మూవీలో హీరోయిన్ గా నటించబోతోంది ఈ బెంగళూరు బ్యూటీ.

సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన కాశీ విశాల్ అనే రచయిత దర్శకుడిగా మారాడు. నాగశౌర్యను హీరోగా పెట్టి ఓ రొమాంటిక్ ఎఁటర్ టైనర్ ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. సుకుమార్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

ఈనెలలోనే ఈ సినిమాను గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నారు. జనవరి నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ప్రస్తుతం రాజు అనే కొత్త దర్శకుడితో భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. ఆ సినిమాతో పాటు సుకుమార్ సినిమాను ఒకేసారి పూర్తిచేస్తాడు.

First Published:  16 Dec 2018 8:01 PM GMT
Next Story