Telugu Global
National

తొక్కలో గీతం " జాతీయ గీతంపై మాధవీలత కామెంట్స్

నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత జాతీయ గీతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తొక్కలో గీతం’ అంటూ సంబోధించడమే కాకుండా ప్రధాని మోడీని దుర్మార్గుడు అని కూడా వ్యాఖ్యానించారు. ఇవాళ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక సందేశాన్ని ఉంచారు. దేశ ప్రధాని నిజస్వరూపం ఏంటో తెలుసుకుందామనే తాను బీజేపీలో చేరానని…. అసలు ఆ పార్టీ నిజంగా దేశానికి సహాయం చేస్తోందా లేక నాశనం చేస్తోందా అనే విషయాన్ని నిర్థారించుకోవడానికి బీజేపీలో చేరినట్లు ఆమె తెలిపారు. మోడీ నిజంగా […]

తొక్కలో గీతం  జాతీయ గీతంపై మాధవీలత కామెంట్స్
X

నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత జాతీయ గీతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తొక్కలో గీతం’ అంటూ సంబోధించడమే కాకుండా ప్రధాని మోడీని దుర్మార్గుడు అని కూడా వ్యాఖ్యానించారు. ఇవాళ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక సందేశాన్ని ఉంచారు.

దేశ ప్రధాని నిజస్వరూపం ఏంటో తెలుసుకుందామనే తాను బీజేపీలో చేరానని…. అసలు ఆ పార్టీ నిజంగా దేశానికి సహాయం చేస్తోందా లేక నాశనం చేస్తోందా అనే విషయాన్ని నిర్థారించుకోవడానికి బీజేపీలో చేరినట్లు ఆమె తెలిపారు. మోడీ నిజంగా దుర్మార్గుడు అనే విషయం తెలిసిందన్నారు.

ఆయన చేసిందల్లా చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్‌లో పాడి మర్చిపోయిన జాతీయ గీతాన్ని పాడమంటాడు. ఎక్కడ మీటింగ్స్ పెట్టినా అదే, ఎంజాయ్ చేద్దామని సినిమాకు పోయినా అదే గీతం.. అసలా గీతాన్ని మర్చిపోయి చాలా కాలం అయ్యింది. అసలు ఎవరికి కావాలి ‘తొక్కలో గీతం’ అంటూ వ్యాఖ్యానించింది.

సినిమాకు పోతే దేశభక్తి ఏంటి మాకు..? ఛీ.. పనిపాట లేని పనులు మాకొద్దు అంటూ ఘాటుగా స్పందించింది. ‘మేం పక్కా లోకల్… పక్కా లోకల్’ లాంటి పాటలు పాడితే మాకు కిక్‌ వస్తది. అయ్యా మోడీ నీకు దేశభక్తి ఉంటే నువ్వు పాడుకో…. మాకెందుకు ఇలా దేశభక్తిని రుద్దడం…. నీ వల్ల దేశానికి ఏం ఉపయోగం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది.

మాధవీలత చేసిన ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. జాతీయ గీతాన్ని అవహేళన చేసేలా ఎందుకు ఇలాంటి పోస్టులు పెడతావంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ పోస్టు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.

నేను బీజేపీ లో జాయిన్ అయ్యిందే అసలు దేశానికి బీజేపీ నిజాంగా సహాయం చేస్తుందా నాశనం చేస్తుందా అని తెలుసు కోవడానికి true గ…

Publiée par Actress Maadhavi sur Lundi 17 décembre 2018

మోడీ గారి దుర్మార్గాలు 2. రాఫెల్ 36 విమానాలు రెడీ 2 ఫైట్ … ఎంత పెద్ద దేశ ద్రోహం ఇది.. మాకెందుకు అండి అవి.. మాకు…

Publiée par Actress Maadhavi sur Mardi 18 décembre 2018

First Published:  18 Dec 2018 6:09 AM GMT
Next Story