Telugu Global
NEWS

మొదలైన బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పల్లెలు, పట్టణాల్లో సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలందరూ గ్రామాల బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు పంచాల్సిన చీరలు ఎన్నికల కోడ్ తో వాయిదా పడడంతో ఈరోజు తెలంగాణ అంతటా వాటిని పంచుతున్నారు. ఆశ్చర్యకరంగా ఇవి ఎమ్మెల్యే అభ్యర్థుల చేతుల మీదుగా సాగుతుండడం గమనార్హం. సిద్దిపేటతో పాటు మండలాల్లోని గ్రామాల్లో ఈరోజు హరీష్ రావు బతుకమ్మ చీరలను పంచారు. ఇక కేటీఆర్ తన సిరిసిల్ల నియోజకవర్గంలో పంచేందుకు స్వయంగా […]

మొదలైన బతుకమ్మ చీరల పంపిణీ
X

తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పల్లెలు, పట్టణాల్లో సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలందరూ గ్రామాల బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు పంచాల్సిన చీరలు ఎన్నికల కోడ్ తో వాయిదా పడడంతో ఈరోజు తెలంగాణ అంతటా వాటిని పంచుతున్నారు. ఆశ్చర్యకరంగా ఇవి ఎమ్మెల్యే అభ్యర్థుల చేతుల మీదుగా సాగుతుండడం గమనార్హం.

సిద్దిపేటతో పాటు మండలాల్లోని గ్రామాల్లో ఈరోజు హరీష్ రావు బతుకమ్మ చీరలను పంచారు. ఇక కేటీఆర్ తన సిరిసిల్ల నియోజకవర్గంలో పంచేందుకు స్వయంగా ఈరోజు సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో పంచేస్తున్నారు.

సీఎం కేసీఆర్ పంచాయతీ ఎన్నికలకు వెళ్లడానికి ముందు బతుకమ్మ చీరల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎంతో లబ్ధి చేకూర్చే, మహిళల ఓట్లను చూరగొనే ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకే ఇప్పుడు గులాబీ ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్ శ్రేణులు స్వయంగా బతుకమ్మ చీరల పంపిణీలో పాలుపంచుకుంటున్నాయి.

వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. అందుకే బతుకమ్మ చీరలను పంచే పనిని ఎమ్మెల్యేలకు అప్పగించారు. కేటీఆర్ నుంచి మొదలు పెడితే కొత్త ఎమ్మెల్యేల వరకూ ఈరోజు తెలంగాణలోని తమ నియోజకవర్గాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో లాభం కలుగుతుందని ఆశిస్తున్నారు.

First Published:  19 Dec 2018 5:55 AM GMT
Next Story