Telugu Global
NEWS

బెంగాల్ కుర్రోడు...16 ఏళ్లకే కోటీశ్వరుడు

ఐపీఎల్ -12 వేలంలో ప్రయాస్ రే బర్మన్ రికార్డు కోటీ 50 లక్షల కాంట్రాక్టు దక్కించుకొన్న ప్రయాస్ 16కోట్ల నుంచి కోటికి పడిపోయిన యువరాజ్ సింగ్ జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ 12వ సీజన్ వేలం తొలిరోజున… బెంగాల్ కుర్రోడు ప్రయాస్ రే బర్మన్ జాక్ పాట్ కొట్టాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే కోటీశ్వరుడుగా మారాడు. 20 లక్షల కనీస వేలం ధరతో జాబితాలో ఉన్న ప్రయాస్ ను…బెంగళూరు ఫ్రాంచైజీ కోటీ 50 లక్షల రూపాయల […]

బెంగాల్ కుర్రోడు...16 ఏళ్లకే కోటీశ్వరుడు
X
  • ఐపీఎల్ -12 వేలంలో ప్రయాస్ రే బర్మన్ రికార్డు
  • కోటీ 50 లక్షల కాంట్రాక్టు దక్కించుకొన్న ప్రయాస్
  • 16కోట్ల నుంచి కోటికి పడిపోయిన యువరాజ్ సింగ్

జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ 12వ సీజన్ వేలం తొలిరోజున… బెంగాల్ కుర్రోడు ప్రయాస్ రే బర్మన్ జాక్ పాట్ కొట్టాడు. కేవలం 16 ఏళ్ల వయసులోనే కోటీశ్వరుడుగా మారాడు.

20 లక్షల కనీస వేలం ధరతో జాబితాలో ఉన్న ప్రయాస్ ను…బెంగళూరు ఫ్రాంచైజీ కోటీ 50 లక్షల రూపాయల ధరకు సొంతం చేసుకొంది.

సబ్ జూనియర్, జూనియర్ స్థాయి క్రికెట్లో లెగ్ స్పిన్నర్ గా సత్తా చాటుకొన్న ప్రయాస్ కు….విరాట్ కొహ్లీ అంటే ప్రాణం. కొహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే… గంటల తరబడి అలానే చూస్తుండిపోతూ ఉండటం ప్రయాస్ కు అలవాటు.

విరాట్ కొహ్లీ అంటే ప్రాణం…

తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో సభ్యుడిగా చోటు దొరుకుతుందని తాను కలనైనా ఊహించలేదంటూ 16 ఏళ్ల ప్రయాస్ పొంగిపోతున్నాడు.

ఇటీవలే ముగిసిన విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ టోర్నీలో ప్రయాస్ 11 వికెట్లు పడగొట్టడం ద్వారా బెంగాల్ రంజీ జట్టులో చోటు సంపాదించాడు. అయితే రంజీ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు.

దుర్గాపూర్ టు ఐపీఎల్…

దుర్గాపూర్ లో క్రికెట్ ఓనమాలు దిద్దుకొని…బెంగాల్ అండర్ -23 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రయాస్… డబ్బు కంటే ఐపీఎల్ క్రికెట్ ఆడటమే ప్రధానమని చెబుతున్నాడు.

టీనేజ్ వయసులోనే కరోడ్ పతిగా మారిన ప్రయాస్…ఐపీఎల్ చాన్స్ ను ఏవిధంగా ఉపయోగించుకొంటాడు?… బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ…పదహారేళ్ల ప్రయాస్ ను.. ఎలా సద్వినియోగం చేసుకొంటాడు? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఎనలేని ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

పాపం! యువరాజ్ సింగ్

2014 ఐపీఎల్ వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ…సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ ను 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 2015 సీజన్లో యువీ వేలం రేటు అమాంతంగా 16 కోట్ల రూపాయలకు చేరింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ యువీకి రికార్డుస్థాయిలో 16 కోట్ల రూపాయలు కాంట్రాక్టు ఇచ్చింది.

అప్పుడు 16…ఇప్పుడు 1…

2016 సీజన్లో మాత్రం యువీ ధర 7 కోట్ల రూపాయలకు పడిపోయింది. హైదరాబాద్ ఫ్రాంచైజీ కేవలం 7 కోట్ల రూపాయల ధరకే యువీని సొంతం చేసుకొంది.

2018 ఐపీఎల్ వేలంలో…యువీ వేలం ధర మరింతగా దిగజారిపోయింది. 7 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలకు పడిపోయింది. కింగ్స్ పంజాబ్ జట్టు …యువరాజ్ కు 2 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి… సీజన్ తర్వాత విడిచి పెట్టింది.

ఇక.. ఐపీఎల్ 12వ సీజన్ వేలంలో యువీని కొనుగోలు చేయటానికి …ప్రారంభంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అయితే… చివర్లో ముంబై ఫ్రాంచైజీ కోటి రూపాయల ధరకే యువరాజ్ సింగ్ ను సొంతం చేసుకొంది.

టీ-20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర ఆటగాడిగా…ప్రపంచకప్ మ్యాచ్ ఓ ఓవర్ ఆరు బాల్స్ లో ఆరు సిక్సర్లు బాదిన మొనగాడిగా పేరున్న యువరాజ్ సింగ్ పరిస్థితి ఇంత బతుకూబతికీ అన్నట్లుగా తయారయ్యింది.

16 కోట్ల రికార్డు ధర నుంచి కోటి రూపాయల ధరకు పడిపోవడం ఐపీఎల్ 12 సీజన్ల వేలానికే హైలైట్ గా…. కఠోర వాస్తంగా మిగిలిపోతుంది. యువరాజ్ సింగ్ ను.. .సింగ్ఈజ్ కింగ్ అనుకొనే రోజులకు కాలం చెల్లినట్లే మరి.!

First Published:  19 Dec 2018 8:40 AM GMT
Next Story