Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమాలో ఊరిని దత్తత్తు తీసుకున్నాడు.... ఈ సినిమాలో.....

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వ సినిమా “మహర్షి”. వంశీ పైడిపల్లి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు కోటీశ్వరుడిగా నటిస్తున్నాడట. అమెరికా లో ఒక పెద్ద కంపెనీకి సి.ఈ.ఓ గా మహేష్ బాబు నటిస్తున్నాడట. అమెరికా లో పని చేస్తున్న మహేష్ బాబుకి…. ఇండియాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొని ఇండియా కి వస్తాడట. ఇక్కడికి వచ్చాక మహేష్ బాబు ఎలాంటి పరిస్థితులని ఎదురుకోవాల్సి వచ్చింది అనేది […]

ఆ సినిమాలో ఊరిని దత్తత్తు తీసుకున్నాడు.... ఈ సినిమాలో.....
X

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25 వ సినిమా “మహర్షి”. వంశీ పైడిపల్లి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు కోటీశ్వరుడిగా నటిస్తున్నాడట. అమెరికా లో ఒక పెద్ద కంపెనీకి సి.ఈ.ఓ గా మహేష్ బాబు నటిస్తున్నాడట.

అమెరికా లో పని చేస్తున్న మహేష్ బాబుకి…. ఇండియాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొని ఇండియా కి వస్తాడట. ఇక్కడికి వచ్చాక మహేష్ బాబు ఎలాంటి పరిస్థితులని ఎదురుకోవాల్సి వచ్చింది అనేది కథట.

ఇదిలా ఉంటే మూడేళ్ళ క్రితం వచ్చిన “శ్రీమంతుడు” సినిమాలో కూడా మహేష్ బాబు కోటీశ్వరుడిగా నటించాడు. అక్కడ కూడా ఒక ఊరిని దత్తత్తు తీసుకొని ఆ ఊరిని బాగుచేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు మహేష్ బాబు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేసింది.

ఇప్పుడు మళ్ళీ “మహర్షి” కోసం అలాంటి రోల్ లో మహేష్ బాబు నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

First Published:  19 Dec 2018 2:00 AM GMT
Next Story