Telugu Global
NEWS

వైసీపీ వాళ్లు హైదరాబాద్ లో పడుకున్నారు... అందుకే ఇలా...

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయో వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నా వైసీపీ వాళ్లు మాత్రం అసెంబ్లీకి రావడం లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఎన్ని కంపెనీలు వచ్చాయని ప్రశ్నించిన ఒక ఎమ్మెల్సీ… సమాధానం వినేందుకు సభకు మాత్రం రావడం లేదన్నారు. ఏపీలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయన్న దానికి సంబంధించిన రికార్డులు అసెంబ్లీలో ఉన్నాయని వెళ్లి చూసుకోవచ్చన్నారు. వైసీపీ నేతలంతా హైదరాబాద్‌లో పడుకున్నారని…. అందుకే ఏపీలో ఏం జరుగుతోందో వారికి అర్థం కావడం లేదన్నారు. […]

వైసీపీ వాళ్లు హైదరాబాద్ లో పడుకున్నారు... అందుకే ఇలా...
X

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయో వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నా వైసీపీ వాళ్లు మాత్రం అసెంబ్లీకి రావడం లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఎన్ని కంపెనీలు వచ్చాయని ప్రశ్నించిన ఒక ఎమ్మెల్సీ… సమాధానం వినేందుకు సభకు మాత్రం రావడం లేదన్నారు.

ఏపీలో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయన్న దానికి సంబంధించిన రికార్డులు అసెంబ్లీలో ఉన్నాయని వెళ్లి చూసుకోవచ్చన్నారు. వైసీపీ నేతలంతా హైదరాబాద్‌లో పడుకున్నారని…. అందుకే ఏపీలో ఏం జరుగుతోందో వారికి అర్థం కావడం లేదన్నారు. ఒకసారి విజయవాడ, విశాఖ వచ్చి చూస్తే ఎన్ని కంపెనీలు వచ్చాయో తెలుస్తుందన్నారు.

ఏపీలో తిరగకుండా హైదరాబాద్‌లో వైసీపీ నేతలు పడుకుని వాస్తవాలకు దూరంగా జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో ఎలాంటి యాక్టివిటీ కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టకుండా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

వైసీపీ నేతలు పదేపదే హెచ్‌సీఎల్‌కు భూములు ఇవ్వడంపై ప్రశ్నిస్తున్నారని… దీని వల్ల హెచ్‌సీఎల్ వాళ్లే తనకు మెసేజ్ చేసి.. మీ రాష్ట్రంలో ప్రతిపక్షం తమనెందుకు టార్గెట్ చేస్తోందని ప్రశ్నించారని లోకేష్ వివరించారు.

దాంతో వారిని తాను సముదాయించాల్సి వచ్చిందన్నారు. వైసీపీ వాళ్లు కోర్టుకు వెళ్లారు… అయినా ఏమీ కాదు… నేను అడ్వకేట్ జనరల్‌తో అంతా మాట్లాడానని హెచ్‌సీఎల్‌ కంపెనీ వారిని సముదాయించాల్సి వచ్చిందన్నారు లోకేష్.

First Published:  19 Dec 2018 6:24 AM GMT
Next Story