హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్

సినీ హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. హైదరాబాద్ రాయదుర్గంలోని తన ఫాంహౌజ్‌ను అధికారులు సీజ్ చేయడాన్ని హైకోర్టులో ప్రభాస్ సవాల్ చేశారు.

పాన్‌మక్తాలో 84 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. దీంతో అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రభాస్ ఫాంహౌజ్ కూడా ఉంది. 2,200 గజాల్లో ప్రభాస్ ఇంటి నిర్మాణం ఉంది. దీంతో ప్రభాస్‌ నివాసాన్ని సీజ్‌ చేశారు.

అయితే తాను ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఈ భూమిని కొనుగోలు చేశామని… ఇది ప్రభుత్వ భూమి కాదని ప్రభాస్ వాదిస్తున్నారు. తాము ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్టు నిరూపించేందుకు డాక్యుమెంట్లను కూడా హైకోర్టుకు ప్రభాస్ సమర్పించారు.