Telugu Global
Cinema & Entertainment

ఇండస్ట్రీ లో సునీల్ టైం అయిపొయింది

30 ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు కమెడియన్ పృథ్వి. ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలం అవుతున్నా…. గత నాలుగేళ్ల నుంచే పృథ్వి కమెడియన్ గా వరుస సినిమాలతో తన హవాను కొనసాగిస్తున్నాడు. అయితే హీరో నుంచి కమెడియన్ గా మారిన సునీల్ కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు పృథ్వి. సునీల్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేసే టైం లో…. కమెడియన్ గా వస్తున్న అవకాశాలు వదిలేసి హీరోగా సినిమాలు […]

ఇండస్ట్రీ లో సునీల్ టైం అయిపొయింది
X

30 ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు కమెడియన్ పృథ్వి. ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలం అవుతున్నా…. గత నాలుగేళ్ల నుంచే పృథ్వి కమెడియన్ గా వరుస సినిమాలతో తన హవాను కొనసాగిస్తున్నాడు. అయితే హీరో నుంచి కమెడియన్ గా మారిన సునీల్ కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు పృథ్వి.

సునీల్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేసే టైం లో…. కమెడియన్ గా వస్తున్న అవకాశాలు వదిలేసి హీరోగా సినిమాలు చేస్తూ వచ్చాడని, హీరోగా కేవలం రెండు సార్లు మాత్రమే సూపర్ హిట్ అందుకోగలిగాడని, ఇక ఆ తరువాత హీరోగా పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయని అన్నాడు.

ఇలాంటి టైం లో సునీల్ కి మళ్ళీ కమెడియన్ గా అవకాశం వచ్చిందని…. కానీ సునీల్ కమెడియన్ గా ఎవర్నీ మెప్పించలేకపోయాడని…. ప్రస్తుతం ఇండస్ట్రీ లో సునీల్ టైం అయిపొయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు పృథ్వి.

First Published:  19 Dec 2018 4:30 AM GMT
Next Story